Kheti Badi

వానాకాలంలో పెసర సాగు చేపడుతున్నారు? అయితే ఈ పద్దతులు పాటించండి....

KJ Staff
KJ Staff

ఈ మధ్య కాలంలో తృణధాన్యాల సాగు రైతులకు ఆసరాగా నిలుస్తుంది. వీటి సాగు విస్తీర్ణం పెంచేందుకు, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, కేంద్ర ప్రభుత్వం కూడా ఎంతగానో కృషిచేస్తుంది. 2024-25 ఖరీఫ్ సీజన్ పంటలకు అందిస్తున్న కనీస మద్దత్తు ధరలో తృణధాన్యాలకు అధిక ప్రాధ్యాన్యత ఇస్తూ కొత్త ధరలను ఆమోదించడం జరిగింది. తృణ ధాన్యాలు సాగుచెయ్యాలనుకున్న రైతులకు పేసర్ పంట ఎంతో లాభదాయకమైనది. ఈ వర్షాకాలంలో పెసర సాగు చేపట్టే రైతులు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మేలైన దిగుబడి పొంది మంచి లాభాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది.

చాలా ప్రాంతాల్లోని రైతులు తొలకరి ప్రారంభం కాగానే పెసర సాగు చేపడతారు. మిర్చిని సాగు చేసే రైతులు, మిర్చి పంటకు ముందు పెసారును సాగుచేస్తారు, పెసర పంటను సాగు చెయ్యడం ద్వారా వాతావర్ణంలోని నత్రజనిని భూమిలో స్థిరీకరించి, మట్టిలో నత్రజని శాతాన్ని పెంచుతోంది. దీని వలన తరవాత పంటలు, నత్రజనిని ఉపయోగించుకొని ఏపుగా పెరుగుతాయి. వరి సాగును ఆలస్యంగా చేపట్టే ప్రాంతాల్లో కూడా పెసరును ముందుగా చేసి ఆ తరువాత వరి సాగు చేపడతారు.

పెసర సాగు చేపట్టే ముందు నాణ్యమైన రకాలను ఎంచుకోవడం ఉత్తమం. అధిక వర్షాలను, తెగుళ్లను తట్టుకోగలిగే మేలైన రకాలను ఎంపిక చేసుకోవాలి. యం.జి.జి. 295, 347, 385, ఐ.పి. యమ్ . 2-14, డబ్ల్యు.జి.జి.42 మొదలైన రకాలు వానాకాలంలో సాగుకు అనువైనవి. ఒక ఎకరానికి 6-7 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. పెసర దాదాపు అన్ని కాలాల్లోనూ సాగుకు అనువైన పంట. దాదాపు అన్ని రకాల నేలల్లోనూ సులభంగా పెంచుకోవచ్చు, అయితే ఆమ్లా, క్షార, నీరు నిలువ ఉండే మురుగు నేలలు సాగుకు అనుకూలమైనవి కావు. నేలను రెండు మూడు సార్లు, మొక్క అవశేషాలు అన్ని భూమిలో కలిసిపోయే విధంగా కలియదున్నుకోవాలి.జూన్ 15 నుండి జులై మొదటి వారం వరకు విత్తుకునేందుకు అనుకూలం. పొలం విత్తనాలు నాటుకుని ముందు విత్తన శుద్ధి కీలకం, దీనికి కోసం, ఒక కిలో విత్తనానికి 5గ్రా థయోమిథాక్సమ్ లేదంటే 5 మిల్లి లీటర్ల ఇమిడాక్లోరోఫిడ్ వీటిని ఉపయోగించి విత్తన శుద్ధి చేసుకోవాలి.

పెసర పంట నుండి మంచి దిగుబడి పొందేందుకు మేలైన ఎరువుల యాజమాన్యం చేపట్టాలి. పంట ఆఖరి దుక్కిలో ఎకరానికి 2 టన్నుల పశువుల ఎరువును వేసి కలియదున్నుకోవాలి. దీని వలన మట్టిలో కర్బన శాతం పెరుగుతుంది, అంతేకాకుండా మట్టిలోని, ఉపయోగకరమైన పరాన్నజీవులు వృద్ధి చెందుతాయి. దీనితోపాటు, 18 కిలోల యూరియా, 40 కిలోల సింగల్ సూపర్ పోస్ఫేట్ వేసి కలియదున్నుకోవాలి. సాధారణంగా పెసరను వర్షాధారితంగా సాగు చేస్తా, సాగు నీరు లబ్యత ఉన్నవారు, విత్తునాటిన తరువాత ఒకసారి, పుష్పించే సమయంలో ఒకసారి మరియు కాయతయారయ్యే దశలో మరోసారి నీటిని అందించాలి.

వర్షాకాలం లో సాగుకు కలుపు ప్రతిబంధకంగా నిలుస్తుంది. ఈ కాలంలో కలుపు మొక్కలు ఏపుగా పెరిగి, పంటకు అందవలసిన నీటిని మరియు పోషకాలను ఆశించి, దిగుబడి తగ్గేలా చేస్తయి. కలుపు సమగ్రంగా నియంత్రించడం కోసం, విత్తనం నాటిన పది రోజుల తరువాత కలుపు మొక్కలను తొలగించాలి. కలుపు సమస్య ఎక్కువుగా ఉన్న ప్రాంతాల్లో, విత్తనం విత్తిన వెంటనే ఒక ఎకరానికి 1.2 మిల్లిలీటర్ల పెండిమిథాలిన్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. అలాగే విత్తనం నాటిన 15 రోజుల తరువాత 2.5 మిల్లీలీటర్ల ప్రోపక్వేజోపాస్ ఇథైల్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. కలుపుతో పాటు చీడపీడలు కూడా పెసరలో తీవ్ర నష్టం వాటిల్లేలా చేస్తాయి, వీటిలో

మొదటిది చిత్త పురుగులు, ఇవి పెసర మొలకెత్తిన వెంటనే ఆకుల మీద రంద్రాలు చేస్తూ కనిపిస్తాయి. దీనిని నివారించడానికి ఎసిఫేట్ 1.5 గ్రా ఒక లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చెయ్యాలి. పెసర మొక్కల్లో వచ్చే ఎల్లో మొసాఇక్ వైరస్ రాకుండ మొక్కలను కాపాడాలంటే తెల్ల దోమను నివారించాలి, తెల్ల దోమ ఈ వైరస్ వ్యాప్తికి కారణమవుతుంది. దీని నివారణ కోసం పొలం మొత్తం పసుపు రంగు జిగురు అట్టలను ఏర్పాటుచేసుకోవాలి. అలాగే తామర పురుగుల నివారణ కోసం ఒక లీటర్ నీటికి ఫీప్రోనిల్ 2 మిల్లిలీటర్లు కలిపి పొలం మొత్తం పిచికారీ చెయ్యాలి. ఈ విధంగా వర్షాకాలంలో అన్ని రకాల యజమాన్య చర్యలు పాటిస్తూ రైతులు ఆశించిన దిగుబడిని పొందవచ్చు.

Share your comments

Subscribe Magazine