వరి. మన దేశంలో ఎక్కువగా పండించే పంటల్లో తొలి వరుసలో ఉంటుంది. ప్రపంచంలోనే వరి పంటలో భారత్ అగ్రస్థానంలో ఉంటుంది. ఇండియాలో పండించే రకరకాల వరి పంటకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ప్రపంచంలో వరిని ఎక్కువగా దిగుబడి చేస్తున్న దేశంగా భారత్ ఉంది. ఒక్క ఎకరమైనా వరి పంట వేసేందుకు ప్రతిఒక్క రైతు ఆసక్తి చూపుతాడు. దీని వల్ల దేశానికే అన్నం పెట్టే వ్యక్తులుగా రైతులు నిలిచారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పంటను ఎక్కువగా పండిస్తారు. మిగతా పంటలతో పోలిస్తే వరి పంట చాలా లాభాదాయకమైనది.
పెట్టుబడి కూడా తక్కువగానే అవుతుంది. శ్రమ కూడా తక్కువగా ఉంటుంది. అయితే వరిలో చాలా తెగెళ్లు వస్తాయి. వాటిని నివారిస్తే వరిలో అధిక దిగుబడి సాధించవచ్చు. ఇక వరి పంటలో ఎరువులు ముఖ్యమైనవి. ఎరువులు చల్లినప్పుడే వరిలో అధిక దిగుబడి వస్తుంది. నత్రజని ఎరువులు ఎక్కువగా చల్లాల్సి వస్తుంది. ఇంతకు వరిలో వచ్చే తెగుళ్లు ఏంటి. వాటి నివారణ ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
అగ్గి తెగులు లేదా మెడ విరుపుతెగులు
ఆకుపై ముదురు గోధుమ రంగు అంచుతో మధ్య బూడిద రంగు గల నూలుకండే ఆకారపు మచ్చలు ఏర్పడతాయి. ఆకులు ఎండిపోయి తగులబడినట్లు కనిపిస్తాయి. ఇక వెన్నుల మెడ భాగంలో వెన్నులు విరిగిపోతాయి. ఇవి కనిపిస్తే అది అగ్గి తెగులు లేదా మెడ విరుపు తెగులు లక్షణం అని చెప్పవచ్చు.
నివారించడం ఎలా?
చేలో, గట్లపైన కలుపు మొక్కలు లేకుండా చేసుకోవాలి. కిలో విత్తనానికి ౩ గ్రా.కార్భ౦డజియ్ కలిపి విత్తనశుద్ది చేయాలి. ట్రైసైక్లోజోల్ 75 శాతం 0.6గ్రా లేదా ఎడిఫెన్ఫాన్ 1 మి.లీ.లీటరు నీటికి కలిపి పైరుపై పిచికారి చేసి అగ్గి తెగులు లేదా మెడ విరపుతెగులును నివారించవచ్చు.
పొడ తెగులు లేదా మాగు తెగులు
కాండం లేదా మట్ట లేదా ఆకులపై మచ్చలు పెద్దవై పాముపోడ మచ్చలుగా ఏర్పడుతుంది. మొక్కలు, పైరు పూర్తిగా ఎండిపోయి కనిపిస్తాయి.
నివారణ ఎలా?
చేలో, గట్లపైన కలుపు లేకుండా చూసుకోవాలి. నత్రజని ఎరువును 3 నుంచి 4 సార్లు చల్లాలి. ద్ధి, సిఫారసు చేసిన నత్రజనిని ౩-4 సార్లు వేయాలి.గట్ల పెన ,చెనులో కలుపు లేకుండా చూదాలి.ప్రోపికోనజోల్ 1 మి.లీ.లేక హెక్సాకోనజోల్ 1 మి.లీ .లేక వాలిడామైసిన్ 2 మి.లీ .లీటరు నీటికి కలిపి 15రోజులకొకసారి రెండు పర్యాయాలు మ౦దు ద్రావణాన్ని పిచికారి చేయడం ద్వారా ఈ తెగులును నివారించవచ్చు.
ఆకు ఎండు తెగులు
వరి పంటలో ఎక్కువగా వచ్చే తెగులు ఇది. ఆకు ఎండు తెగులు బాక్టీరియా ద్వారా వస్తుంది. ఆకు అంచుల నుండి పసుపు రంగు నీటి దాగు మచ్చలుగా ఏర్పడి ఆకులపై నుంచి క్రింద పడతాయి.
నివారణ చేయడం ఎలా?
నత్రజనిని 3 నుంచి 4 సార్లు వేయాలి. తెగులు 5 శాత౦ కంటె ఎక్కువైతే నత్రజని వేయడం తాత్కాలికంగా నిలుపుచేయాలి.
కాండం కుళ్ళు తెగులు
వరి పంటలో ప్రధానంగా ఈ తెగులు వసతూ ఉంటుంది. ఆకుతోడిమపై నల్లటిమచ్చలు ఏర్పడతాయి. లోపలి కా౦డానికి విస్తరించి కణపుల మధ్య భాగమ౦తా సల్లగా మరుతాయి ఆకులు పసుపు రంగుకు మారిపిలకలు చనిపోతుంటాయి. కా౦డ౦ ప్రదేశందగ్గర విరిగి పోతు౦ది.
నివారణ చర్యలు
విత్తన శుద్ధి చేయాలి. వాలిడామైసిన్(2.మి.లీ) లేదా హెక్సాకోనాజో ల్(2.మి.లీ.) లీటరు నీటికి కలిపి 15 రోజుల కొకసారి 2 సార్లు పిచికారి చేయాలి.
పొట్టికుళ్ళు తెగులు
పోతాకు తొడిమలపై నల్లటి లేదా గోధుమ రంగు మచ్చలు ఏర్పడి వెన్నులు పోత్తిలో కుళ్ళిపోతాయి. వెన్న పాక్షికంగా మాత్రమే బయటకు వస్తు౦ది. వరిలో ఎక్కువగా వచ్చే తెగులు ఇది.
నివారణ
ఈ తెగులు పొట్టదశలో ఒకసారి, 7 రోజుల తరువాత రెండవపారి కర్చండజిమ్ 50 శాత౦ మ౦దు లీటరు నీటికి 1 గ్రాము చొప్పున కలిపి పిచికారి చేయడం ద్వారా ఈ తెగులును నివారించవచ్చు.
మానిపండు తెగులు
వరిలో ఈ తెగులు ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ తెగులు ఎక్కువగా పూత దశలో వస్తుంది.అండాశయ౦, శిలీంద్ర౦ వల్లి ఆకుపచ్చరంగు ముద్దగా మారుతుంది. అది పసుపురంగులోకి మారి చివరకు నల్లబడి పోతుంది.
నివారణ
కర్చ౦డజిమ్ 1(గ్రాము లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 2.5 గ్రాములు లీటరు నీటికి కలిపి వెన్నులు పైకి వచ్చు దశలో ఒకసారి , వారం రోజుల తరువాత రెండవసారి పిచికారి చేయడం ద్వారా ఈ తెగులును నివారించవచ్చు.
టు౦గ్రో వైరస్
వరి పంటలో ఇది ఎక్కువగా వస్తుంది. ఈ వైరస్ పచ్చదిపపు పురుగుల వల్లన వస్తుంది. వైరస్ పోకిన మొక్కలు కురచుగా ఉంటాయి. ఎదగక, పిలకలు తగ్గిపోతాయి. ఆకులు చివరల నుండి లేత ఆకుపచ్చ లేక నారింజ రంగు లోకి మారుతాయి. ముదురు ఆకుల మీద తుప్పు మచ్చలు ఏర్పడతాయి, మొక్కల నుండి వెన్నులు రావు. వచ్చినా చిన్నవిగా ,గింజలు గట్టిపడక తాలుగా మారుతాయి. ఇలా రక్షణాలు వెంటనే గుర్తించడం వల్ల ఈ వైరస్ నుంచి వరి పంటను కాపాడుకోవచ్చు.
నివారణ
ఈ వైరన్ అశించిన మొక్కలను గురించిన వెంటనే తీసి నాశన౦ చేసి పచ్చదీపపు పురుగులను నివారించాలి.
Share your comments