రైతులు పంట వేసిన దగ్గర నుంచి అది చేతికి వచ్చేంత వరకు అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలి. పగలు, రాత్రి అనక కాపలా కాస్తూ ఉండాలి. తెగులు బారిన పడకుండా, సరిపోయేంత నీళ్లు అందేలా, కలుపు మొక్కలు రాకుండా చూసుకుకోవాలి. ఇవన్నీ దగ్గరుండి చూసుకుంటేనే రైతులకు అధిక దిగుబడి వస్తుంది. అప్పుడే రైతులు పెట్టిన పెట్టుబడికి తగిన మంచి దిగుబడి వస్తుంది.
ముఖ్యంగా కలుపు మొక్కల సమస్య ఎక్కువగా ఉంటుంది. వేసిన పంటకు అందాల్సిన శక్తిని ఈ కలుపు మొక్కలు తీసుకోవడం వల్ల పంటకు నష్టం జరుగుతుంది. అందుకే కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు పీకివేస్తూ ఉండాలి. ఒక్క కలుపు మొక్క కూడా ఉండకుండా చూసుకోవాలి. పంట మొక్కలకు ఎరువు లేదా ఏదైనా మందు వేసినా వాటికి అందకుండా కలుపు మొక్కలు పీల్చుకుంటాయి.
అందుకే కలుపు మొక్కల సమస్య రైతులను బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కలుపు మొక్కలను పీకివేయడానికి కూలీలు కూడా చాలామంది అవసరం ఉంటుంది. దీని వల్ల రైతులకు వచ్చే దిగుబడి కూడా తగ్గిపోతుంది. కలుపు మొక్కల సమస్య నుంచి బయటపడేందుకు రైతులు అనేక పద్దతులు పాటిస్తూ ఉంటారు.
కలుపు మొక్కలను నివారించడానికి అనేక రసాయనాలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించి కలుపు మొక్కలను నివారించడం ఒక పద్దతి. ఇప్పుడు కూరగాయల తోటల్లో కలుపు మొక్కలను నివారించడం ఎలా? అనేది తెలుసుకుందాం.
టామాటో పంటలో కలుపు మొక్కలు నివారించడం ఎలా?
ఎకరం టమాటా తోటలో 200 లీటర్ల 200 గ్రాముల మెట్రిబుజిన్ 70 శాతం టాటామెట్రి పొడి కలుపుకుని పిచికారీ చేయాలి
బెండలో కలుపును అరికట్టడం ఎలా?
200 లీటర్ల నీటిలో 250 మి.లీ ఫెనాక్సోప్రాప్ ఇథైల్ 9 శాతం విప్ సూపర్ ద్రావకం కలిపి ఎకరం తోటలో పిచికారీ చేయాలి
దొండలో కలుపుని నివారించడం ఎలా?
200 లీటర్ల నీటిలో 400 మి.లీ క్వైజిలాపాప్ ఇథైల్, 5 శాతం టార్గా సూపర్ ద్రావకం కలిపి ఎకరం పోలంలో పిచికారీ చేయాలి.
పై విధంగా చేయడంలో వల్ల మీరు కలుపు మొక్కలను నివారించవచ్చు.
Share your comments