Kheti Badi

వరిలో జింక్ లోపం తలెత్తకుండా చేపట్టవలసిన చర్యలు

KJ Staff
KJ Staff

రెండు తెలుగు రాష్ట్రాల్లో వరి పంట ప్రారంభమయ్యింది. దాదాపు అన్ని చోట్ల, వరి నాట్లు పూర్తయి, పంట పిలకలు దశలో ఉంది. అయితే అధిక శాతం నేలల్లో జింక్ లోపం ఉండటం చేత, వరి పంటలో జింక్ లోపం ఎక్కువుగా కనిపిస్తుంది. ఈ లోపాలు ఎక్కువుగా వరి నారుమడి మరియు పిలకలు దశలో ఇనుపదాతు మరియు జింక్ లోపం ఎక్కువుగా కనిపిస్తుంది. వరినాట్లు నాటిన 2-4 వారాల్లో ఈ లోపం కనిపించేందుకు అవకాశం ఉంటుంది. జింక్ లోపం ద్వారా ముదురాకు మధ్య, మరియు చివర్లలో ఇటుక రంగు మచ్చలు కనబడతాయి. జింక్ లోపం ఎక్కువుగా ఉన్నట్లైతే మొక్కల్లో పై నుంచి 3-4 ఆకుల మధ్య ఈనె పాలిపోయి రాలిపోయే ప్రమాదం ఉంటుంది. ఆకులు చిన్నవిగా ,పెళుసుగా మారితాయి. మొక్కలు గిడసబారి దుబ్బు కూడా చేయవు.నత్రజని ఎరువులు వేసినప్పటికీ పైరు పచ్చబడదు.

నేల తత్వాన్ని బట్టి ఈ సూక్ష్మ పోషకాల లోపాలు తలెత్తుతాయి. క్షౌర నేలలు, సున్నం అధికంగా ఉన్న నేలలు మరియు పొలంలో ఎక్కువ కాలం నీరు నిలిచిపోయినప్పుడు ఇనుపదాతు లోపం ఏర్పడుతుంది. అంతేకాకూండా భాస్వరం ఎరువులు ఎక్కువుగా వాడే నేలల్లో కూడా ఇనుపదాతు లోపం ఎక్కువుగా కనబడుతుంది. ధానితోపాటుగా, నల్ల రేగడి నేలలు, క్షారభూములు, సున్నం అధికంగా ఉన్న నేలలు మరియు మురుగు నీరు నిలిచిపోయే నేలల్లో జింక్ దాతు లోపం కనబడుతుంది.

జింక్ దాతు లోపాన్ని నివారించడానికి, ఏడాదికి మూడు వరి పంటలు పండించేవారు ఒకసారి, రెండు పంటలు పండించేవారు, ప్రతి రబీ సీజన్లో, ఆఖరి దుక్కిలో ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ వేసి కలియదున్నాలి. పంట ఎదిగే సమయంలో జింక్ లోపం కనిపించినట్లైతే, లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి, పై పూతగా మొక్కలపై పిచికారీ చెయ్యాలి. జింక్ లోపాన్ని అశ్రద్ధ చేస్తే దిగుబడి 10% వరకు తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. జింక్ లోపం కనిపించిన వెంటనే జింక్ సల్ఫేట్ నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి, ఇలా 2-3 సార్లు చెయ్యడం ద్వారా మొక్కకు అవసరమైన జింక్ అదించవచ్చు. చౌడు నేలల్లో సాగు చేసేవారు పంట ఆఖరి దుక్కిలో తప్పకుండ జింక్ సల్ఫేట్ కలపాలి.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More