Kheti Badi

ఖరీఫ్ చిరుధాన్యాల సాగుకు అవసరమైన మెళుకువలు.....

KJ Staff
KJ Staff

చిరుధాన్యాలు వీటినే సిరిధాన్యాలు, అని కూడా పిలుస్తారు. ఒక్కపుడు మన పూర్వికులు వీటిని తినే ఎన్నో ఏళ్ళు ఆరోగ్యంగా బతికేవారు. అయితే కాలక్రమేణా ప్రజలు వీటిని ఆహారంగా వినియోగించడం తగ్గించేశారు. దీనితో వీటి సాగు విస్తీర్ణం కూడా తగ్గిపోయింది. చిరుధాన్యాల్లో ఎన్నో రకాల పోషకాలు, విటమిన్లు మరియు ఖనిజాలు సంవృద్ధిగా లభిస్తాయి. వీటికున్న ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకొని వీటికి వినియోగం పెంచాలని, 2023 సంవత్సరాని ఇయర్ అఫ్ మిల్లెట్స్ గా ప్రకటించారు.

మిల్లెట్స్ ను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మధుమేహం, ఊబకాయం, మరియు రక్తపోటు వంటి వ్యాధులు తగ్గడానికి అవకాశం ఉంటుంది. వీటిని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయని వైద్యులు సలహాతో ఎంతో మంది చిరుధాన్యాల వైపు మొగ్గు చూపుతున్నారు. చిరుధాన్యాల్లో అరికెలు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగులు వంటి వాటికి మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది. రైతులు వీటిని సాగు చెయ్యడం ద్వారా తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది.

చిరుధాన్యాల పంటలను గట్టి పంటలుగా పరిగణిస్తారు, వీటిని దాదాపు అన్ని కాలాల్లోనూ సాగు చెయ్యడానికి అనువుగా ఉంటాయి. చిరుధాన్యాలు, అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ సులభంగా పెరుగుతాయి. చౌడు, నేలల్లో సైతం వీటిని సులభంగా పెంచవచ్చు. అంతేకాకుండా చీడపీడల నుండి తట్టుకొని నిలబడి అద్భుతమైన రోగనిరోధక శక్తిని కనబరుస్తాయి. మన తెలుగు రాష్ట్రాల్లోని ఎంతోమంది రైతులు. జూన్, జులై మాసాల్లో, సాగు చేస్తారు. ఖరీఫ్ సీజన్లో చిరుధాన్యాల సాగు చేపట్టే రైతులు కొన్ని మెళుకువలను పాటించడం ద్వారా మంచి దిగుబడులను పొందవచ్చు.

అయితే ప్రస్తుతం సాగు చేస్తున్న చిరుధాన్యాలను పెద్ద గింజ కలిగిన చిరుధాన్యాలు మరియు చిన్న గింజ చిరుధాన్యాలుగా విభజించారు, పెద్ద గింజ కలిగినవి జొన్నలు మరియు సజ్జలు, అదేవిధంగా చిన్న గింజల్లో కొర్రలు, సమ్మెలు, అరికెల, రాగులు ఇలా వివిధ రకాలున్నాయి. వీటిలో జొన్నలు, సజ్జలు, మరియు రాగులను అధిక విస్తీరణంలో సాగు చేస్తున్నారు, వీటికి ప్రస్తుతం మార్కెట్లో డీమాండ్ కూడా అధికంగా ఉంది. వీటిని దాదాపు అన్ని రకాల నేలల్లోనూ సాగు చెయ్యవచ్చు, అయితే మురుగు నీరు నిల్వ ఉండే నేలల్లో వీటిని సాగు చెయ్యడం కష్టం. వీటిని ఖరీఫ్ లేదా రబి పంటగా విత్తుకునే అవకాశం ఉంటుంది. ఖరీఫ్ పంటగా సాగు చేసే రైతులు, జూన్ రెండొవ వారం నుండి ఆగష్టు రెండొవ వారం వరకు విత్తుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చిరుధాన్యాలను అంతరపంటలుగా కూడా విత్తుకునే అవకాశం ఉంటుంది.

సాధారణంగా చిరుధాన్యాల విత్తనాలు కాస్త చిన్నవిగా ఉంటాయి, కాబట్టి నేల తయారీ విషయంలో జాగ్రత్త పాటించాలి. నేలను నాగలితో రెండు నుండి మూడు సార్లు బాగా దున్నుకోవాలి. విత్తనాన్ని 2 సెంటీమీటర్ల లోపల విత్తుకోవాలి, మరి లోతుగా విత్తుకుంటే విత్తనం మొలకెత్తడం కఠినంగా మారుతుంది. విత్తనాన్ని నేరుగా భూమిలో నాటుకుంటే ఒక ఎకరానికి 2-3 కిలోల విత్తనం సరిపోతుంది, అదే వెదజల్లే పద్దతిలో ఐతే ఎకరానికి 3-4 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. విత్తనాలు నాటే ముందు, విత్తనశుద్ధి చెయ్యడం ద్వారా పంట మొదటి దశలో వచ్చే తెగుళ్ల నుండి రక్షణ కల్పించవచ్చు, ఇందుకోసం ఒక కిలో విత్తనానికి 10మి.లి థయోమిథాక్సామ్ కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. పంట ఆఖరి దుక్కులో ఒక ఎకరానికి 4-5 టన్నుల పశువుల ఎరువును వేసి కలియదున్నుకోవాలి. దీనితోపాటు, ఒక ఎకరానికి 8 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరం, 8కిలోల పోటాష్ ఎరువులను వేసి తరువాత విత్తనాలను నాటుకోవాలి. 

చిరుధ్యాలను నాటిన మొదటి ముప్పై రోజుల వరకు ఎదుగుదల చాలా నెమ్మదిగా ఉంటుంది, ఈ సమయలో కలుపు నివారణ చాలా అవసరం. కలుపును నియంత్రించకుంటే మొక్క ఎదుగుదల లోపిస్తుంది. కలుపు నివారణకు, విత్తిన 48 గంటలోపు ఒక ఎకరానికి 400 గ్రాముల అట్రాజిన్ 200 లీటర్ల నీటికి కలిపి పొలం మొత్తం పిచికారీ చెయ్యాలి. అదేవిధంగా పంట 20-24 రోజుల దశలో ఉన్నపుడు, రోటవేటర్ తో కలుపును నివారించుకోవాలి. అలాగే పంట 30-35 రోజుల దశలో ఉన్నపుడు 30 కిలోల నత్రజని వెయ్యవలసి ఉంటుంది, దీని ద్వారా మొక్కలు ఏపుగా పెరుగుతాయి.

సాధారణంగా చిరుధాన్యాలను, వర్షాధార పంటలుగా సాగు చేస్తారు. అయితే నీటి లబ్యత ఉన్నవారు, పూతపూసే దశ, గింజలు పాలుపోసుకునే దశ మరియు గింజ గట్టిబడే దశల్లో నీటిని అధిస్తే మంచి నాణ్యమైన దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. చిరుధాన్యాల పంటలకు చీడపీడల సమస్య తక్కువుగా ఉంటుంది. అయితే కొన్ని రకాల పురుగులు పంటను ఆశించి నష్టం కలిగించే ప్రమాదం ఉంది. కత్తెర పురుగు పంటల ఆకులను తింటూ మొక్కలకు నష్టం కలిగిస్తుంది. దీనిని నివారించడానికి 0.4 గ్రాముల ఇమామెక్టిమ్ బెంజోయట్ ఒక లీటర్ కలిపి పిచికారీ చేసుకోవాలి. చిరుధాన్యాల జీవితకాలం చాలా తక్కువ, విత్తునాటిన 80-90 రోజుల్లోపు పంట చేతికి వస్తుంది. యజమాన్య పద్దతులన్నీ సరైన విధంగా పాటిస్తే మంచి లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది.

Share your comments

Subscribe Magazine