సాధారణంగా మనకు మామిడి పండ్లు తినాలనిపిస్తే వేసవి కాలం వరకు ఎదురు చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మామిడిపండ్ల సీజన్ వేసవికాలంలోనే కనుక మామిడి పండ్లు తినాలి అనుకునేవారు అంత వరకు ఎదురు చూడాలి. కానీఇకపై అలా ఏడాది మొత్తం మామిడిపండ్ల కోసం ఎదురు చూడాల్సిన పనిలేదు అని ఈ సంవత్సరం పొడవునా మనకు మామిడి పండ్లు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినవచ్చని రాజస్థాన్‌కు చెందిన శ్రీకిషన్ సుమన్ అనే రైతు చెబుతున్నారు.
రాజస్థాన్‌లోని కోటకు చెందిన శ్రీకిషన్ సుమన్ మామిడి లో సరికొత్త రకాన్ని అభివృద్ధి చేశారు. ఈ రకం మామిడి పండ్లు మనకు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయని, సాధారణ మామిడితో పోలిస్తే ఈ రకం మామిడి పండ్లలలో రోగ నిరోధకశక్తిని పెంపొందించే లక్షణాలతో పాటు ఎన్నో వ్యాధులను అరికట్టే గుణాలు ఉన్నాయని తెలిపారు. ఈ మామిడి పండులో తక్కువ పీచు, పోషకాలు మెండుగా ఉంటాయి. ఈ మామిడి చెట్లను మన ఇంటి ఆవరణంలో చిన్న కుంపట్లో కూడా పెంచుకోవచ్చని ఈ సందర్భంగా శ్రీ కిషన్ సుమన్ తెలిపారు.
చదువుకు పూర్తిగా స్వస్తి చెప్పి పంట పనుల్లో నిమగ్నమైన సుమన్ 2000 సంవత్సరంలో ఏడాది మొత్తం ముదురు ఆకుపచ్చరంగులో ఆకులు ఉండి చెట్టు పై ఏడాది పొడవునా పూత ఉన్నటువంటి మామిడి చెట్లు పరిశీలించారు. ఈ క్రమంలోనే ఆ చెట్టు నుంచి మరో ఐదు చెట్లకు అంటూ కట్టి వాటిని సంరక్షించారు.‘సదా బహార్’ అని పిలువబడే ఈ కొత్త రకాన్ని అభివృద్ధి చేయడానికి రైతుకు సుమారు 15 సంవత్సరాల సమయం పట్టిందని తెలిపారు.
రైతు పండించిన ఈ కొత్తరకం మొక్కలను నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్(ఎన్‌ఐఎఫ్) సదాబహార్‌ను పరిశీలించి ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీ, ఫార్మర్స్ రైట్ యాక్ట్, ఐకార్-నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనటిక్ రిసోర్స్లో రిజిస్టర్ చేసింది. ఈ విధమైనటువంటి కొత్తరకాన్ని అభివృద్ధి చేసిన రైతుకు తొమ్మిదో నేషనల్ గ్రాస్‌రూట్స్ ఇన్నోవేషన్, ట్రెడిషినల్ నాలెడ్జ్ అవార్డుతో సత్కరించింది. ఈ విధమైనటువంటి మేలు రకం మామిడి మొక్కల కోసం దేశ విదేశాల నుంచి పెద్దఎత్తున ఆర్డర్లు వచ్చాయని మన దేశంలో కూడా ఆంధ్ర ప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఒరిస్సా, కేరళ వంటి వివిధ రాష్ట్రాలలో కూడా ఈ విధమైనటువంటి మొక్కలు సాగులో ఉన్నాయని ఈ సందర్భంగా రైతు తెలిపారు.
Share your comments