వేగంగా పెరుగుతున్న జనాభా అలాగే వారి ఆహారపు అవసరాలను తీర్చిడం కోసం ఎప్పుడు లేని విధంగా పురుగుమందులు అలాగే ఇతర రసాయనాలు వ్యవసాయం లో ఎక్కువగా వాడుతున్నారు. వీటి మూలంగా పర్యావరణ కాలుష్యమే కాకుండా మనిషి యొక్క ఆరోగ్యం కూడా తీవ్రంగా దెబ్బ తింటుంది. దీనిని నియంత్రించడానికి ప్రకృతి వ్యసాయం ఒక గొప్ప ఆయుధం. శ్రీ. సుభాష్ పాలేకర్ గారు 1990 వ శతకంలో మొట్ట మొదటిసారి ఆవిష్కరించారు. దీనినే మొదట జీరో బడ్జెట్ నతురల్ ఫార్మింగ్ అని కూడా పిలిచే వారు. ఎన్నో లాభాలు ఉన్న ప్రకృతి వ్యవసాయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అధిక ఉత్పత్తి:
ప్రకృతి వ్యవసాయం లో సూచించిన సూచనలు అన్ని క్రమం తప్పకుండ పాటిస్తే సాధారణ వ్యవసాయం కంటే ఎక్కువ లాభాలు పొందవచ్చు అని నివేదికలు సూచిస్తున్నాయి.
రైతులకు అధిక ఆదాయం:
సాధారణంగా ప్రకృతి వ్యసాయం లో ఉపయోగించే వనరులు అని సహజంగా లభించేవే. దీని ద్వారా రైతులు తమ ఖర్చులని తగ్గించుకుని ఆదాయం పెంచుకునే అవకాశం ఉంటుంది.
ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు :
ప్రకృతి వ్యవసాయం లో ఉపయోగించే పురుగు మందులు, ఎరువులు అన్ని ప్రకృతి నుండి సేకరించినవే కనుక ఆహరం కలుషితం కాకుండా ఉంటుంది. అంతే కాకుండా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే వీలు ఉంటుంది.
మట్టిని కాపాడుకోవచ్చు:
ప్రకృతి వ్యవసాయం యొక్క ముఖ్య ఉదేశ్యం మట్టిని అలాగే మట్టిలోని జీవరాసులను సంరక్షించడం. రసాయన ఎరువులను పురుగు మందులను పూర్తిగా నియంత్రిచడం వాళ్ళ మట్టి క్షిణతను తగ్గించవచ్చు.
పశువుల పెంపకం:
పశువుల పెంపకం ప్రకృతి వ్యవసాయం లో ఒక భాగం. పశువుల నుండి సేకరించిన పేడను, మూత్రాన్ని, పొలానికి ఎరువుగా వాడతారు. ఈ విధంగా ప్రకృతి వ్యవసాయం వాళ్ళ ఎన్నో ఉపయోగాలు ఉన్నాయ్
https://telugu.krishijagran.com/horticulture/management-practices-of-dragon-fruit-in-telugu/
Share your comments