ప్రస్తుతం దేశంలో కోళ్ల పరిశ్రమ బాగా అభివృద్ధి చెందుతోంది.ముఖ్యంగా బ్రాయిలర్స్ కోళ్లను మాంసం ఉత్పత్తి కోసం పెంచుతారు.ప్రస్తుతం బాయిలర్ కోళ్ళ ద్వారా వచ్చే మాంసం ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో 5వ స్థానంలో కొనసాగుతోంది. అధిక పోషక విలువలున్న మాంసాన్ని ఇచ్చే బ్రాయిలర్ కోళ్ళను తక్కువ పెట్టుబడితో ఒక పరిశ్రమగా ప్రారంభించి చాలా మంది రైతులు, నిరుద్యోగ యువత అధిక లాభాలను పొందుతున్నారు.
ముఖ్యంగా బ్రాయిలర్ కోళ్ళ పెంపకంలో స్వల్పకాలంలో అధిక లాభాలను సాధించాలంటే మొదట నాణ్యమైన కోడి పిల్లలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.హేచరి నుండి తీసుకు వచ్చిన ఒక రోజు వయస్సు ఉన్న కోడిపిల్లలకు తగిన వెచ్చదనం ఉండేటట్లు చూసుకోవాలి.
వెచ్చదనం కొరకు సాధారణ విద్యుత్ బల్బులు లేదా ఇన్ఫ్రారెడ్ లేదా గ్యాస్ బ్రూడర్ ద్వారా వెచ్చదనం కల్పించవచ్చు.
మొదటి వారంలో 95 ° ఫారెన్ హిట్ ఉండునట్లు చూడాలి. తరువాత ప్రతివారం 5° వేడిని తగ్గిస్తూ 6వ వారం వచ్చే సరికి 70° ఉండేటట్లు చూడాలి.అలాగే 15 రోజుల వరకు బ్రూడర్ చుట్టూ చిక్ గార్డును మరియు 7 రోజుల వరకు వరిపొట్టు పై న్యూస్ పేపర్ ఏర్పాటు చేయాలి.ఈదురు గాలులు లేదా బలమైన గాలులు. షెడ్డులోకి వీయకుండా ఇరువైపులా పరదాలు లేదా గోనె సంచులు ఏర్పాటు చేయాలి కోడి పిల్లలను ఎప్పటికప్పుడు గమనిస్తూ బలహీనంగా, బరువు తక్కువ ఉన్న కోడి పిల్లలను ఎప్పటికప్పుడు తీసివేయడం ఉత్తమం లేదంటే వీటికున్న వ్యాధులు ఇతర కోడి పిల్లలకు వ్యాప్తి చెందుతాయి.
Share your comments