శాస్త్రీయంగా ఫలం అయినపటికి, టమాటో ఒక కాయగాయ గానే పరిగణించబడుతుంది. 2022 జనవరి, నాటి నివేదిక ప్రకారం టమాటో సాగులో భారత దేశం రెండవ స్థానంలో మరియు అత్యధికంగా వినియోగించబడుతుంది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ అఫ్ పోస్ట్ హార్వెస్ట్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ(సిఫేట్ ) నివేదిక ప్రకారం పండించిన పంటలో 25-30% పంట వృధాగా పోతుంది. ముఖ్యంగా టమాటో రవాణాలోనూ, మార్కెట్లలోను, నిల్వ చేసే సమయాల్లోనూ ఎక్కువగా వృధా అవుతుంది. అతిపరిపక్వత గుణం కలిగి ఉండటం దీనికి ప్రధాన కారణం. ఈ వృదాను తగ్గించేందుకు ప్రభుత్వ , మరియు ఇతర వాణిజ్య సంస్థలు ఎంతగానో కృషి చేస్తున్నాయి. టమాటో సరఫరా లో లోపాల్ని తగ్గించి, యాంత్రికరణను పెంచే విధంగా ప్రయత్నిస్తున్నారు.
టమాటోలో నష్టాన్ని తగ్గించేందుకు అనేక మార్గాలు ఉన్నాయ్ వాటిలో కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం:
హార్వెస్టింగ్ విధానాలు మెరుగుపరుచుట:
టమాటో పంట లో ఎక్కువ శాతం నష్టం సరియిన హార్వెస్టింగ్ విధానాలు ఉపయోగించకపోవడం వాళ్ళ తలెత్తుతాయి. సుమారు 50% కంటే ఎక్కువ పంట హార్వెస్టింగ్ విధానాలు సరిగ్గా లేకపోవడం వాళ్ళ వస్తాయి. వ్యవసాయ యంత్రాలు వినియోగించడం, కోత కోసే కూలీలకు సరియిన శిక్షణ ఇవ్వడం ద్వారా పంట నష్టాన్ని తగ్గించవచ్చు.
కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చెయ్యడం:
మన ఇండియ లో కోల్డ్ స్టోరేజ్ వ్యవస్థ మన అంచనాలకు తగ్గట్టు లేదు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రబుత్వాలు దీనిపై సమీక్షా జరిపి ప్రతి మండలం లోను కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తే పంట నష్టాన్ని తగించేందుకు ఎంతగానో సహాయపడుతుంది.
రవాణా వ్యవస్థను మెరుగుపరచడం :
సాధారణంగా రైతులు తాము పండించిన పంటలు లోకల్ మార్కెట్ లో విక్రయిస్తూ ఉంటారు. సుదూర ప్రాంతాలకు ఎగుమతి చేసే రైతులు రవాణా సమయం లో తగు జాగ్రత్తలు తీసుకోవడం చాల మంచిది. అవకాశం ఉంటె కోల్డ్ ఫ్రీజర్ వాన్లలో ఎగుమతి చేయడం శ్రేయస్కరం.
Share your comments