ప్రస్తుత ఆధునిక వ్యసాయంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అనేక రకాల పురుగుమందులు రసాయనిక ఎరువులు విరివిగా వాడుతున్నారు. ఇవి మట్టిలోను నీళ్లలోనూ కలిసి పర్యావరణానికి తీరని హాని కలిగిస్తున్నాయి. దీనిని వెంటనే అరికట్టకపోతే భూమికి ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది. ఐతే వ్యవసాయ వ్యర్ధాలు ఉపయోగించి సేంద్రియ పద్ధతుల్లో పంటకు అవసరం అయ్యాయి ఎన్నో పోషకాలు అందించవచ్చు. అటువంటి వ్యర్దాల నుండి వచ్చిందే ఈ బయోచార్.
బయోచార్ అంటే బయో చరికాల్ అని అర్ధం. బయోచార్ వ్యసాయంలో ఉపయోగించడం ద్వారా మొక్కకు అవసరం అయ్యే పోషకాలు అన్ని అందించవచ్చు. బయో చార్ మట్టిలోని మంచి బాక్టీరియాను పెంచి భూమిని సారవంతం అయ్యేలా చేస్తుంది. భూమిలో నీటిని పట్టి ఉంచి మొక్కకు అందేలా చేస్తుంది.
బయోచార్ తయారు చేసుకునే విధానం:
బయోచార్ను ఎన్నో విధాలుగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మనం డబల్ బారెల్ పద్ధతిలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా వ్యవసాయ వ్యర్ధాలు అయినా కర్ర ముక్కలను, చెక్క ముక్కలు, ఆకులు, పశువుల ఎముకులు, సేకరించాలి. తర్వాత రెండు ఇనుప బర్రెర్ల్స్ను ఒకదానిలో ఒకటి ఉంచి రెండిటికి మధ్య కొంచెం కాలిని ఉంచాలి. ఇప్పుడు ముందుగానే సిద్దంచేసుకున్న వ్యవసాయ వ్యర్దాలను లోపలి బర్రెల్లో ఉంచి ముతను బిగించాలి. ఇప్పుడు రెండు బారెల్స్ కి మధ్య ఉన్న కాలిలో గడ్డిని అలాగే కర్ర ముక్కలను ఉంచి నిప్పు అంటించాలి. మొత్తం బర్రెలను ఒక మూతతో మూసి పొగ బయటకి పోవడానికి ఒక గొట్టాన్ని ఆ మూతకు ఆమ్రచవలసి ఉంటుంది. బయట బారెల్ నుండి వచ్చే వేడికి లోపల బారెల్ లో ఉంచిన వ్యవసాయ వ్యర్ధాలు బొగ్గుగా మారతాయి. దీనినే మనం బయో చార్ అని పిలుస్తాం.
Share your comments