Kheti Badi

వరి సాగులో కొత్త పద్ధతి.... ఖర్చు తక్కువ లాభం ఎక్కువ....

KJ Staff
KJ Staff

మన దేశంలో అధిక విస్తీరణంలో సాగయ్యే పంట వరి, అంతేకాకుండా వారే భారతీయుల ప్రధాన ఆహారం. అయితే వరి పంటను సాగు చెయ్యడానికి మాత్రం అధికమొత్తంలో నీరు మరియు పోషకాలు అవసరం. వరి పంటకు నీటిని వినియోగించే సామర్ధ్యం చాలా తక్కువ. దీనితో వరి ఎక్కువుగా సాగు చేసే ప్రాంతాల్లో నీటి వినియోగం ఎక్కువుగా ఉంటుంది. వరి పంట మెట్ట పరిస్థితులను తట్టుకోలేడు, ఇటువంటి పరిస్థితిలో దిగుబడితో పాటు పంట నాణ్యత కూడా దెబ్బతింటుంది.

నీటి లబ్యత తక్కువుగా ఉన్నవారు, వరి పంటను సాగు చెయ్యడానికి శ్రీవరి సాగు పద్దతిని పాటిస్తూ మంచి లాభాలు పొందవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఈ పద్దతిని పాటించడం ద్వారా తక్కువ నీరు మరియు పెట్టుబడితో, ఎక్కువ లాభాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. శ్రీవరి సాగు పద్దతిని పాటించడం ద్వారా అనతి కాలంలో పంట చేతికి రావడంతోపాటు ఊహించిన స్థాయిలో దిగుబడులు పొందేదుకు అవకాశం ఉంటుందని వ్యవసాయ అధికారులు రైతులకు సూచిస్తున్నారు.

శ్రీవరి పద్దతిలో సాగు చేసేందుకు ముందుగా పొలం మొత్తం దున్ని, ఎటుపల్లాలు లేకుండా పొలం మొత్తం సమాంతరంగా చేసుకోవాలి. పొలం లోపల నుంచి చిన్న గట్లను ఏర్పాటు చేసుకోవాలి. ఈ పద్దతిలో వరి నాటేందుకు పొలం మొత్తం తడిగా బురదతో, ఉంటే సరిపోతుంది, పొలం మొత్తం నీటితో నింపవలసిన అవసరం ఉండదు. ఈ పద్దతిలో పొలంలో నీరు నిలవకూడదు కాబట్టి నీరు బయటకు పోవడానికి డ్రైన్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.

శ్రీవరి సాగుకి నారుమడి జాగ్రత్తగా తయారుచేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఒక సెంటు భూమిని బాగా దున్ని దుక్కి చేసి, ఎతైన బెడ్ లాగా ఏర్పాటు చేసుకోవాలి. నారుమట్టి కొట్టుకుపోకుండా నారుమడి చుట్టూ కర్రలతో లేదంటే గడ్డితో ఊతం ఇవ్వాలి. నారుమాడి తయారైన తరువాత, దీనిని మీద పశువులు ఎరువును ఒక పొరలుగా వేసి దాని మీద విత్తనాలను చల్లాలి. ఈ పద్దతిలో ఒక ఎకరానికి రెండు కిలోల విత్తనం సరిపోతుంది. విత్తనాలు చల్లే ముందు మండికట్టడం ద్వారా విత్తనాలు వేగంగా మొలకెత్తేందుకు అవకాశం ఉంటుంది.

ఈ విత్తనాలను నారుమడి మీద ఒక పల్చని పొరలుగా చల్లి, దానిపై ఎండు గడ్డి లేదంటే, పశువుల ఎరువును చల్లి ఉంచాలి. దీని మీద ప్రతిరోజు నీళ్లు చల్లాలి. ఇలా 8-10 రోజుల్లాగా విత్తనం నాట్లు వెయ్యడానికి సిద్దమవుతుంది. నారుమడి నుండి నారుని పికాకుండా, మట్టితో సహా నాట్లను పొలానికి తరలించాలి. వరి నాట్లు నాటేముందు నేల బురదగా మరియు వదునుగా ఉండేలా చూసుకోవాలి, ప్రతి మొక్కకు మధ్య 25 సెంటీమీటర్ల పొడవు మరియు 25 సెంటీమీటర్ల వెడల్పు ఉండేలా నాటుకోవాలి. మొక్కలు నాటేటప్పుడు బురదతో నాటితే మొక్కలపై ఒత్తిడి లేకుండా ఉంటుంది. మొక్కలు నాటే సమయంలో పొలంలో 15-20 సెంటీమీటర్ల వెడల్పుతో పొలంలో బాటలు ఏర్పరచుకోవాలి, దీనివలన పొలంలో తిరగడానికి మరియు మందులు ఇతర ఎరువులు జల్లేందుకు సులభంగా ఉంటుంది.

శ్రీవరి సాగులో నీటిని అందించే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. పొలంలో నీరు నిలిచిపోయిన, నీటిని ఎక్కువుగా అందించినా సరే మొక్కల్లో ఎదుగుదల లోపించి, పిలకలురావు, దీనితో దిగుబడి చాలారెట్లు తగ్గిపోతుంది. వరి నాట్లు నాటిన తరువాత పొలం పొడిగా మరియు తడిగా ఉండేలా చూసుకోవాలి. అధికంగా ఉండే నీరు బయటకు పోవడానికి డ్రైన్లను ఏర్పాటు చేసుకోవాలి. మట్టిలో తేమ శాతాన్ని బట్టి 3-4 రోజులకు ఒకసారి నీటిని అందిస్తే సరిపోతుంది. శ్రీవరి సాగులో నీరు నిలవకుండా ఉండటం వలన కలుపు సమస్య ఎక్కువ, కలుపును సమగ్రవంతంగా నివారించేందుకు కలుపును ఎప్పటికప్పుడు నివారించడం లేదంటే రోటవేటర్ తో ముందుకు వెనక్కి కదిలించడం ద్వారా కలుపు మొక్కలు భూమిలో కలిసిపోతాయి.

శ్రీవరి పద్దతిలో సాగు చెయ్యడం ద్వారా సాధారణ పంటకంటే 10-15 రోజుల ముందే పంట చేతికి వస్తుంది. అంతేకాకుండా ఈ పద్దతిలో అవసరమయ్యే విత్తన వినియోగం కూడా చాలా తక్కువ కాబట్టి రైతులు అదనంగా ఖర్చు చెయ్యవలసిన అవసరం ఉండదు. ఈ పద్దతిని 1980 లో మడగాస్కర్ అనే దేశంలో కనుగొన్నారు. ఈ పద్దతి ద్వారా తక్కువ నీరు మరియు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందేందుకు అవకాశం ఉంటుంది.

Share your comments

Subscribe Magazine