రైతులు పంటలు సాగు చేసే విషయంలో తక్కువ పెట్టుబడి.. దిగుబడి అధికంగా రావడం అంశాలు కీలకం. ఒక వేళ మార్కెట్ లో ధరలు లేకపోయిన రైతులు తీవ్రంగా నష్టపోకుండా ఉంటే పంటలను సాగు చేయడం ఉత్తమం. అలాంటి పంటల్లో టమాటా సాగు ఒకటి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో అధిక మొత్తంలో అన్నదాతలు టమాటా సాగు చేస్తున్నారు. టమాట సాగులో ప్రధానంగా వచ్చే తెగుళ్లలో ఆకు మాడు తెగులు ఒకటి. ఈ తెగులు అన్ని కాలాల్లోనూ టమాట పంటకు సోకుతుంది. దీని వల్ల మొక్కలు తీవ్రంగా దెబ్బతినడంతో పాటు కాయలు, పండ్లు పాడైపోతాయి.
టమాట ఆకు మాడు తెగులు లక్షణాలు: ఆకు మాడు తెగులు పంగస్ వల్ల సంక్రమిస్తుంది. దీని కారణంగా మొక్కల్లో ఆకులపై మచ్చలు ఏర్పడతాయి. అవి మొదట లేత గోధుమ, పచ్చ రంగులో మచ్చలుగా కనిపిస్తాయి. క్రమంగా ఆకులు మొత్తం గోధుమ రంగులోకి మారతాయి. ఆకు కింద భాగంలోనూ తెలుపు, బూడిద రంగులో బూజు పెరుగుతుంది. ఈ తెగులు ప్రభావం మరింత ఎక్కువైతే ఆకుల నుంచి మొక్కల కాండం, కొమ్మలు, సహా ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. దీంతో మొక్క బలహీన పడుతుంది. పండ్లకు సైతం ఇది సోకుతుంది. దీంతో పండ్లు పాడైపోతాయి. పండ్లకు ఆకు మాడు తెగులు సంక్రమిస్తే.. పండ్ల పై భాగంలో తొక్కలు గట్టిపడి పోతాయి. క్రమంగా పండ్లు పూర్తగా దెబ్బతింటాయి.
టమాట ఆకు మాడు తెగులు నివారణ: టమాటలో ఆకు మాడు తెగులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో ముఖ్యమైంది ఈ తెగులు రాకుండా అడ్డుకునే వంగడాలను సాగు చేయడం. మొలకల దశలో సిలికేట్ కలిగిన ఎరువులను వేసుకోవాలి. దీని వల్ల ఫంగస్ రాకుండా ఉంటుంది. సాయంత్రం పూట టమాట సాగుకు నీరు పెట్టకుండా ఉండాలి. తెగులు సోకి మరింతగా ముదిరిన మొక్కలను పంట నుంచి తొలగించాలి. దీంతో మిగతా పంట పంటను నష్టపోకుండా ఉంటుంది. ఈ తెగులు నివారణ కోసం ప్రోపమైడ్క్లోరోతలోనిల్ఫ్లువాజినంమాంకోజెబ్ ఆధారిత శీలింద్ర నాశినులను పిచికారీ చేసుకోవాలి.
Share your comments