
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లలో ప్రస్తుతం వాతావరణ మార్పులు అధికంగా ఉన్నాయి. అందువల్ల తక్కువ వర్షాలు, అధిక ఉష్ణోగ్రతలు, చౌడు భూములు, పోషక లోపాలు ఇలా ఎన్నో అజీవ ఒత్తిడులను (Abiotic Stress) రైతులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో పంటలను బతికించటమే కాదు, గిట్టుబాటు ధర దక్కించుకోవడం కూడా సవాలుగా మారింది.
అయితే, ఈ క్రమంలో బయోస్టిములెంట్స్ (Biostimulants)లను వాడడం ద్వారా ఒక కొత్త వ్యవసాయ పద్ధతి ముందుకు వచ్చింది. రైతులకు ఉత్పాదకత పెంచడంలో, పర్యావరణ అనుకూల సాగు కోసం ఈ విధానం మార్గదర్శకంగా మారుతోంది. ఇటీవల జరిగిన ఒక పరిశోధన ద్వారా బయోస్టిమ్యులెంట్ల ప్రయోజనాలు మరింత స్పష్టంగా వెల్లడయ్యాయి.
బయోస్టిమ్యులెంట్స్ అంటే ఏమిటి?
ఈ పదార్థాలు మొక్కలలో ఆంతరిక రక్షణ, వృద్ధి హార్మోన్లు, వ్యాధి నిరోధకత, పోషక పదార్థాల గ్రహణ సామర్థ్యం పెంపొందిస్తాయి.
బయోస్టిములెంట్స్ అనేవి:
- సముద్ర ఆల్జీ ఎక్స్‌ట్రాక్ట్ (Seaweed Extracts).
- హ్యూమిక్, ఫుల్విక్ ఆమ్లాలు (Humic & Fulvic Acids).
- అమినో ఆమ్లాలు (Amino Acids).
- సహాయక సూక్ష్మ జీవులు (Beneficial Microbes).
బయోస్టిమ్యులెంట్స్ ఎందుకు అవసరం?
తెలంగాణలో వానకాలం (ఖరీఫ్) పంటల సాగు విస్తృతంగా జరుగుతుంటే, ఏపీలో రబీ, సమ్మర్ పంటలు అధికంగా ఉన్నాయి.
అయితే వాతావరణ మార్పుల కారణంగా:
- తక్కువ వర్షాభావం.
- పెరుగుతున్న చౌడ భూములు.
- అధిక ఉష్ణోగ్రతలు.
- పోషకాల లోపం వంటి సమస్యలు తీవ్రంగా ఉంటున్నాయి.
బయోస్టిమ్యులెంట్స్ ప్రయోజనాలు
- ఉష్ణోగ్రత 40°C దాటి పోయినప్పుడు కూడా మొక్కలు కిరణజన్య సంయోగక్రియలని కొనసాగించగలుగుతాయి.
- పైరు వృద్ధి మందగించి మెట్ట అవ్వకుండ నిరోధించడం.
- వర్షాభావం ఉన్నప్పుడు నీటిని సమర్థంగా వాడే సామర్థ్యం పెరుగుతుంది.
- తెలంగాణ లో రైతులు పత్తి, మొక్కజొన్న, వరి వంటి పంటలపై ప్రయోగించవచ్చు.
- చౌడ భూముల్లో పుష్కలమైన మొక్కల వృద్ధి, ఎక్కువ దిగుబడి.
- ఆంధ్ర తీర ప్రాంత రైతులు ఈ బయోస్టిమ్యులేన్ట్స్ ని ఉప్పు భూముల్లో ప్రయోజనంగా వాడవచ్చు.
- మైక్రో న్యూట్రియంట్ల లోపాన్ని తగ్గించటం ద్వారా ఆరోగ్యకరమైన మొక్కలు, ఎక్కువ గింజలు.
- పల్లీలు, ధాన్యాలు వంటి పంటల పెరుగుదలకు గింజలు పుష్టిగా తయారు అవ్వడానికి దోహదం అవుతుంది.
అలానే పాలకుర, కంది, మిరప, వరి, మొక్కజొన్న వంటి ప్రాధాన్య పంటలకు తక్కువ పెట్టుబడితో అధిక లాభం.
అనధికారిక బయోస్టిమ్యులెంట్స్ కొనకుండా, ICAR, ANGRAU, PJTSAU లాంటి సంస్థలు సూచించిన ఉత్పత్తులు మాత్రమే వాడాలి.
బయోస్టిమ్యులెంట్స్ జీవాణు ఆధారితమైనవి (Microbial) కావడం వల్ల పరిమిత కాలవ్యాప్తి, తగిన ఉష్ణోగ్రతలు అవసరం.
మోతాదును కచ్చితంగా పాటించాలి, ఎక్కువ మోతాదుతో ప్రయోజనం ఉండదు, మరికొంత నష్టం కూడా కలిగే అవకాశం.
వాతావరణ మార్పులు తెలుగు రాష్ట్రాల్లో రైతులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఈ రోజుల్లో, బయోస్టిమ్యులెంట్స్ వాడకమే స్మార్ట్ వ్యవసాయం లో భాగం. రైతులు తక్కువ పెట్టుబడితో, అధిక దిగుబడి, పర్యావరణాన్ని దెబ్బతీయకుండా సాగు చేయాలంటే, ఈ బయోస్టిములెంట్లు చాలా అవసరం.
సూచన: ప్రాంతీయ వ్యవసాయ శాఖ అధికారులు, ICAR/PJTSAU/ANGRAU వంటి ప్రామాణిక సంస్థల సూచనలు అనుసరించి మాత్రమే వీటిని వాడటం మంచిది. రైతులు వాడే ముందు, ప్రాధికారిక వ్యవసాయ అధికారుల సలహా తీసుకోవాలి.
Share your comments