Kheti Badi

చెరువు మట్టితో ప్రయోజనాలు.

KJ Staff
KJ Staff
pond soil uses in Agriculture
pond soil uses in Agriculture

సాధారణంగా గతంలో ఎండాకాలంలో నీరు ఎండిపోయినప్పుడు చెరువుల నుంచి మట్టి ని తీసి ఆ మట్టిని పొలాల్లో వేసుకునేవారు. ఇప్పుడు ఈ పద్ధతి పాటించేవారు తక్కువయ్యారు.

కానీ దీనివల్ల రెండు రకాలుగా ప్రయోజనం కలుగుతుంది. వర్షాలు పడ్డప్పుడు ఆ నీటితో కలిసి పోషక విలువలు కలిగిన సారవంతమైన మట్టి మొత్తం వచ్చి చెరువులోకి చేరుతుంది. ఈ మట్టితో చెరువు నిండుతుంది. వేసవిలో నీళ్లు తక్కువగా ఉండడం వల్ల ఈ మట్టిని పూడిక తీయడం వల్ల మళ్లీ వచ్చే ఏడాది చెరువులో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. ఎక్కువ నీళ్లు నిలిచే అవకాశం ఉంటుంది. తద్వారా నీటి లభ్యత పెరుగుతుంది. ఇక చెరువు నుంచి తీసిన ఈ సారవంతమైన మట్టిని పొలాల్లో వేయడం ద్వారా ఆ పొలాలు సారవంతమవుతాయి. చెరువు మట్టిలో ఎక్కువగా ఉండే ఆల్గే వల్ల నత్రజని ఎక్కువగా అందుతుంది. దిగుబడి పెరుగుతుంది.

చెరువు మట్టి లోతు బట్టి అందులోని పోషకాలు ఆధార పడి ఉంటాయి. అయితే ఇందులో ఆమ్ల, క్షార తత్వాలతో పాటు పురుగు మందుల అవశేషాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మట్టిని సేకరించి పొలానికి తరలించే ముందే భూసార పరీక్షలు చేసి తరలించడం మంచిది. ఇలా కనీసం రెండు మూడేళ్లకోసారి పొలంలో మట్టిని నింపుకోవడం ద్వారా వర్షాల వల్ల నీటి కోతకు గురైన భూములకు చికిత్స జరుగుతుంది.

చెరువు మట్టి వేయడం, పచ్చి రొట్ట పెంచడం, పశువుల పేడ ఉపయోగించడం వంటివి చేయడం వల్ల భూమి గుల్లబారుతుంది. పోషకాలు పెరుగుతాయి. మురుగు నీటి పారుదల పెరగడమే కాదు.. ఎరువుల అవసరమూ చాలా వరకు తగ్గుతుంది.

చెరువు మట్టిని పొలాల్లో ఉపయోగించడం ద్వారా ప్రయోజనాలు

* చెరువు మట్టిని పొలాల్లో వేయడం ద్వారా పొలాన్ని ఆమ్ల, క్షార గుణాలతో తటస్థంగా మార్చుకోవచ్చు.

* నేల గుల్లబారుతుంది. మురుగు నీటి పారుదల మెరుగవుతుంది.

* నేలలో లవణాల గాఢత తగ్గుతుంది. సూక్ష్మ, స్థూల పోషకాల స్థాయులు పెరుగుతుంది. ముఖ్యంగా నత్రజని స్థాయులు పెరుగుతాయి.

* మట్టితో పాటు సేంద్రియ ఎరువులను కూడా కలిపి పొలంలో వేసుకోవడం వల్ల రసాయన ఎరువుల వాడకాన్ని చాలా వరకు తగ్గించవచ్చు.

* ఈ మట్టిలో సూక్ష్మ జీవులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి నేలలో గాలి పరిమాణాన్ని పోషకాలను పెంచుతాయి.

* అన్ని రకాల పోషకాలను అందిస్తూ దీర్ఘకాలికంగా పంట పొలం ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది.

* కరువు, వర్షాభావ పరిస్థితులను కూడా ఎదుర్కొనే శక్తిని నేలకు అందిస్తుంది.

* మొక్కలు ఆరోగ్యంగా, ఎత్తుగా పెరుగుతాయి.

* దిగుబడి కూడా ప్రతి పంటలోనూ ఎకరానికి ఏడు నుంచి పది క్వింటాళ్ల మేర పెరుగుతుంది.

* ఎరువుల కోసం ఉపయోగించే మొత్తాన్ని తగ్గించడంతో పాటు దిగుబడిని కూడా పెంచి రైతుకు ఆదాయాన్ని అందిస్తుంది.

చెరువు మట్టిని సేకరించేందుకు ముందు చేయించాల్సిన పరీక్షలు

* చెరువు మట్టి పూడిక స్థాయి, లోతు, విస్తీర్ణం గమనించాలి. దాన్ని తీయడం వల్ల చెరువుకు ఉపయోగం ఉందా? అని గమనించాలి

* చెరువు మట్టిలోని పోషకాల స్థాయిని గుర్తించేందుకు మట్టి పరీక్షలు చేయించాలి

* ఈ పరీక్షల్లోనే ఆ మట్టిలోని రసాయన అవశేషాల స్థాయిని కూడా తెలుసుకోవాలి

ఇవన్నీ చేయడం వల్ల చెరువులోని మట్టిని ఉపయోగిస్తూ పంటలను సేంద్రియ పద్ధతుల్లో పండించుకోవచ్చు. రసాయన ఎరువులకు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా పంటలు పండించుకునే వీలుంటుంది. వర్షాధార నేలల్లో వీటిని ఎక్కువగా వేస్తుంటారు. ఈ నేలల్లో ఖరీఫ్ సమయంలో జొన్న, కంది, పత్తి, ఆముదం పంటలు.. రబీ సీజన్ లో వేరు శనగ, పెసర, మినుము, మొక్కజొన్న పంటలు సాగు చేసుకోవడానికి అనువుగా ఉంటాయి.

https://krishijagran.com/agripedia/soil-testing-purpose-of-doing-soil-analysis-how-to-do-it/

https://krishijagran.com/success-story/this-hyderabad-based-farmer-turns-chowdu-bhoomi-alkaline-soil-into-cultivable-lands-with-good-yields/

Share your comments

Subscribe Magazine