మన రాష్ట్రంలోనే కాక దేశం మొత్తంలో కుడా మంచి లాభాలు తెచ్చి పెట్టే పంట జామ సాగు. వివిధ రకాల ఆహార పదార్థాల తయారీలో కూడా జామ పండ్లను ఉపయోగిస్తారు. దేశం మొత్తం లో రకరకాలైన జామ పండ్లు సాగు చేయబడుతాయి.
మన రాష్ట్రంలో ముఖ్యంగా...
లక్నో-49, బనారసి, అనకాపల్లి, చిట్టిదార్, హాఫ్సి, సఫెద్ జాం, సర్దార్ , అలహాబాద్ సెఫ్డ్, ఆర్కా మృదుల మరియు స్మూత్ గ్రీన్ లాంటి జామ రకాలు సాగు చేయబడుతాయి.
జామ సాగు కోసం చేయవల్సిన పనులు:
నాట్ల కోసం భూమిని సిద్దం చేసేందుకు వేసవి కాలంలో పనులు మొదలు పెడతారు రైతులు. నేలను చదును చేయడం, దున్నడం మరియు కలుపు మొక్కల్ని ఏరెయ్యడం వంటి పనులన్నీ ముగించేస్తారు.
విత్తుకొనే పద్దతి:
జామ చెట్లు ఏపుగా ఎదిగే మొక్కలు కావడం వల్ల, విత్తనాలు లేదా మొక్కల నాట్లు వేసేందుకు ఇనార్ఖింగ్ మరియు ఏయిర్ లేయరింగ్ పద్దతులను ఉపయోగిస్తారు.
మొక్కకు మొక్కకు మధ్య అంతరం:
నాట్లు వేసే సమయం లో మొక్కకు మొక్కకు మధ్య అంతరం 5 నుండి 8 మీటర్లు ఉండేలా చూసుకోవాలి. ఈ కచ్చితమైన అంతరం ద్వారా నీటి పారుదల సాఫీగా సాగి మొక్కల పునరుత్పత్తి వ్యవస్థ మెరుగ్గా ఉంది ఎక్కువ పంట చేతికి వస్తుంది.
కలుపు నివారణ:
సాగులో కలుపు మొక్కల నివారణకు రైతులు కొన్ని రకాల ఎరువులను వాడుతారు. వర్షాకాలం లో ఈ ఎరువుల వాడకాన్ని మొదలు పెడుతారు. ఒక హెక్టారుకు 1.6 కిలోల డియురాన్(diuron), 1.6 కిలోల సిమజైన్(simazine), ఒరైజలిన్(Oryzalin), వంటి ఎరువులు కలుపు సంహారానికి వాడుతారు. లేదా కలుపు మొక్కలు చిగురించడానికి ముందే 1.6 కిలో అట్రాజిన్ (atrazin) నీ వాటి నివారణకు వాడుతారు.
దిగుబడి:
నాట్లు వేసిన మూడు సంవత్సరాలకి కాయలు కాచి పంట చేతికి వస్తుంది. ఈ మూడేళ్ల సమయంలో సంవత్సరానికి రెండు సార్లు చొప్పున సేంద్రీయ పదార్థాలను భూమి పొరల్లో చొప్పించడం వల్ల ఆరోగ్యవంతమైన పంట పండి ఊహించిన దానికంటే మెరుగైన దిగుబడి పొందవచ్చు.
Share your comments