Kheti Badi

భూసార పరీక్షలు తప్పనిసరిగా ఎందుకు చేయించుకోవాలి?

KJ Staff
KJ Staff

మనం రోజూ యాక్టివ్‌గా పనిచేయాలంటే మన శరీరం సహకరించాలని. మంచి పాజిటివ్ మూడ్‌లో నవ్వుతూ ఉండాలి. మన చుట్టుపక్కలవారితో కూడా మంచితో ఉంటూ వారితో సరదాగా ఉండాలి. అలాగే మంచిగా పనిచేయాలంటే మంచి శరీరానికి అవసరమైన మంచి ఫుడ్ తీసుకోవాలని. శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తే.. అవి కూడా మనకు సహకరిస్తాయి. టైమ్‌కి తిండి తినకుండా ఉంటే మన శరీరం నిరసించిపోయి ఏ పని చేయలేం.

సేమ్ అటూ సేమ్ అలాగే పొలంలో పంట బాగా పడాలంటే.. మట్టిలో ఎంత సారం ఉందనేది తెలుసుకోవడం చాలా అవసరం. అది తెలుసుకోవాలంటే భూసార పరీక్షలు చేయించుకోవాలి. బయట మార్కెట్‌లో చాలా కిట్‌లు దొరుకుతున్నాయి. దీని ద్వారా స్వయంగా భూసార పరీక్షలు చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వాలు కూడా ల్యాబ్‌లు ఏర్పాటు చేసి ఉచితంగా భూసార పరీక్షలు నిర్వహిస్తున్నాయి. దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భూసార పరీక్షలను నిర్వహిస్తున్నాయి.

భూసార పరీక్ష ఎందుకు?

మట్టిలో ఉండే భూసారాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీని వల్ల మట్టిలో ఎంత సారం ఉందనేది తెలుస్తుంది. పొలంలోని మట్టిలో ఎక్కువ భూసారం ఉంటే ఎరువులు, రసాయనాలు ఎక్కువ వాడాల్సిన అవసరం ఉండదు. మట్టిలో భూసారం ఉండటం వల్ల పంట దిగుబడి బాగా వస్తుంది. ఎరువుల ఖర్చు కూడా చాలా తగ్గుతుంది. అలాగే భూసారాన్ని బట్టి ఏ పంట వేస్తే ఎక్కువ దిగుబడి వస్తుందనేిది తెలుస్తోంది. దీని వల్ల మంచి లాభం ఉంటుంది. 

భూసార పరీక్షకు మట్టిని ఎలా సేకరించాలి?

-పోలంలో వీ ఆకారంలో 15సె.మీ వరకు పారతో గుంట తీయాలి
-అందులో పై పొర నుంచి క్రింది వరకు ఒక ప్రక్కగా మట్టిని సేకరించాలి
-ఆ తర్వాత సేకరించిన మట్టిలో రాళ్లు, పంట వేర్లు, మొదళ్లు లేకుండా చూసుకోవాలి
-ఆ తర్వాత మట్టిని నీడలో బాగా ఆరబెట్టాలి
-ఇలా ఎకరా విస్తీర్ణంలో 8-10 చోట్ల మట్టిని సేకరించాలి

ఎలాంటి చోట్ల సేకరించాలి?. ఎక్కడ సేకరించకూడదు?

-గట్ల దగ్గర, పంట కాల్వలోని మట్టి తీయకూడదు
-ఎరువు కుప్పలు వేసిన చోట మట్టిని సేకరించరాదు
-నీరు నిల్వ ఉండే చోట మట్టిని సేకరించకూడదు
-చెట్ల క్రింద ఉన్న పొలం భాగం నుంచి మట్టిని సేకరించకూడదు

సేకరించిన మట్టిని ఏం చేయాలి?


-బాగా ఆరిన తర్వాత ప్లాస్టిక్ ్యాగ్‌లో, గుడ్డ సంచిలో వేసి భద్రపరచాలి.
-ఆ తర్వాత సమీపంలోని వ్యవసాయశాఖకు సంబంధించి భూసార పరీక్ష ల్యాబ్‌కిమీ వివరాలతో పంపాలి.
-రైతు పేరు, కావాల్సిన పరీక్ష్
-వేయబోయే పంట
-పైన వివరాలతో సేకరించిన మట్టిని పంపాలి.

Related Topics

soil test, land, crop

Share your comments

Subscribe Magazine