Kheti Badi

సూపర్ ఫుడ్ గా బ్లాక్ రైస్, తెల్ల అన్నం మానెయ్యచ్చా?

KJ Staff
KJ Staff

మన భారతీయులకు అన్నం ప్రధాన ఆహారం. మన శరీరానికి అవసరమైన పోషకాలు మరియు ఇతర ఖనిజాలు అన్నం ద్వారా అందుతాయి. అయితే ఈ మధ్య కాలంలో బ్లాక్ రైస్ పేరు బాగా వినబడుతుంది. సాధారణ బియ్యంతో పోలిస్తే బ్లాక్ రైస్ ఎక్కువ పోషకాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుందని చెబుతున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజమో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ బ్లాక్ అస్సాం ప్రాంతంలో ఎక్కువుగా పండుతుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఒక సందర్భంలో బ్లాక్ రైస్ గురించి మాట్లాడుతూ, దీనిని సూపర్ ఫుడ్ అని కొనియాడారు. ఈ బ్లాక్ రైస్, ఈశాన్య భారతదేశంలో ఎక్కువుగా పెరుగుతుంది, ఈ బియ్యం చూడటానికి నల్లగా ఉంటుంది, అయితే ఉడికించిన తరువాత ఊదా రంగులోకి మారుతుంది. అయితే ఈ బియ్యం నలుపు రంగులో ఉండటానికి, ఈ బియ్యంలోని యాంతోసియానిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పిగ్మెంట్ కారణం. బ్లాక్ రైస్ సాగును మన దేశంతోపాటు, థాయిలాండ్, జపాన్ మరియు చైనా వంటి దేశాల్లో కూడా పండిస్తారు. ఈ బ్లాక్ రైస్ ని సూపర్ ఫుడ్ గా పిలవడానికి దీనిలోని పోషకవిలువలే కారణం.

ఒక 100 గ్రాముల నల్ల బియ్యంలో 79.1 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 4.7 గ్రాముల పీచు పదార్ధాలు, 11.6 గ్రాముల ప్రోటీన్, 1.67 మిల్లి గ్రాముల ఐరన్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతోమేలు చేస్తాయి. పీచు పదర్ధాలు ఎక్కువుగా ఉండటం చేత రక్తంలో చెక్కెర స్థాయిని నియంత్రిస్తుంది కాబట్టి, షుగర్ ఉన్నవారుకి ఎంతో ఉపయోగకరం. అంతేకాకుండా పీచు పదర్ధాలు పేగు ఆరోగ్యాన్ని, జీర్ణ సంబంధిత వ్యాధులను, సమగ్రవంతంగా నివారిస్తుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది.

2017 లో విడుదలైన బయోలాజికల్ మరియు ఫార్మాసిటికల్ బుల్లెటిన్ ప్రకారం బ్లాక్ రైస్ లో యాంటీ దియాబెటిక్ లక్షణాలున్నాయి, బ్లాక్ రైస్ తినడం ద్వారా రక్తంలోని చెక్కెర స్థాయి పెరగకుండా కాపాడవచ్చని తేలింది. అంతేకాకుండా టైపు-2 డయాబెటిస్ రాకుండా కూడా నివారిస్తుంది. బ్లాక్ రైస్ లోని యాంటీ ఇంఫ్లమ్మెటరి లక్షణాలు శరీరంలో వచ్చే వాపును మరియు మరియు అనేక రకాల వ్యాధులను రాకుండా నివారిస్తుంది.

బ్లాక్ రైస్ లోని కొన్ని ప్రత్యేక గుణాలు మరియు యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని మలినాలను శుభ్రం చేసి శరీరాన్ని డిటాక్స్ చేస్తాయి, అలాగే కాలేయం పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. శరీరంలో ఉన్న విషపదార్ధాలను బయటకు పంపించడంలో సహాయం చేస్తుంది. బ్లాక్ రైస్ లో ఉండే లూటిన్, లైకోపీన్, బీటా కెరోటిన్ వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. యూవీ కిరణాల నుంచి కంటిని రక్షిస్తాయి.

బ్లాక్ రైస్ లో ఉండే పీచు పదర్ధాలు, యాంటీఆక్సిడెంట్లు, గుండె ఆరోగ్యాన్ని మరియు పనితీరును మెరుగుపరచడంలో సహాయం చేస్తాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ కారణంగా, మెదడు పనితీరు దెబ్బతిని జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. బ్లాక్ తింటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గి మెదడు సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి, అంతేకాకుండా క్రమంగా జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. బ్లాక్ రైస్ లోని పీచు పదార్ధం వలన కొంచెం తినగానే కడుపునిండిపోతుంది, దీనిని మనం తీసుకునే కెలోరీలు తగ్గి, బరుపు పెరగకుండా ఉంటుంది. రోజుకు 100-150 గ్రాముల వరకు బ్లాక్ రైస్ తినొచ్చు దీనివలన శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి.

Share your comments

Subscribe Magazine