తెలంగాణ రాష్ట్రంలో వరదల కారణంగ నష్టపోయిన వారికీ తెలంగాణ ముఖ్య మంత్రి ప్రకటించిన విధంగా గురువారం నుంచి వరద బాధితుల ఖాతాల్లో రూ.10 వేలు జమ చేస్తామని మంత్రి తుమ్మల బుధవారం తెలిపారు. ఇండ్లు పూర్తిగా దెబ్బతిన్నోళ్లకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు .
ఇప్పటికి ఖమ్మం జిల్లలో రెస్క్యూ కొనసాగుతుందని వరద ప్రభావిత ప్రాంతాల్లో బురద తొలగించేందుకు అదనంగా పారిశుధ్య కార్మికులను, ట్రాక్టర్లను పక్క జిల్లా నుంచి రప్పిస్తున్నామని. బా ధితులకు ఆహారం, తాగునీరు అందిస్తున్నాం. నిత్యావసర సరుకులు పంపిణీ చేసాం అని తెలిపారు.
గత వందేండ్లలో సంవత్సరాలలో ఇలాంటి వరదలు రావడం ఇదే మొదటిసారి అని , అయినా ఎలాంటి ప్రాణ నష్టం జరగ కుండా సహాయక చర్యలు చేపట్టామన్నారు.
వ్యాధులు ప్రబలకుండా హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పది బృందాలు రంగంలోకి దిగాయని, ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తు న్నాయని పేర్కొన్నారు. ఫైర్ ఇంజన్లతో రోడ్లను శుభ్రం చేస్తున్నామని తెలిపారు.అదేవిధంగా సహాయక సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
రైతులకు ఉచితంగా సోలార్ పంపులు ;సీఎం కీలక ప్రకటన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి బాధిత కుటుంబానికి రూ.10వేలు పరిహారం ప్రకటించి, ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని సీఎం హామీ ఇచ్చారు.
Share your comments