AP లో పదో తరగతి ప్రశ్న పత్రం లిక్ కావడం తీవ్ర కలకలం రేపింది . పరీక్షలు ప్రారంభమైన తొలి రోజే ఈ ఘటన చోటు చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి . చిత్తూరు, నంద్యాల జిల్లాల్లో తెలుగు పేపర్-1 ప్రశ్నాపత్రాలు లీక్ అవడం ,వాట్సాప్ గ్రూప్‌ల్లో పేపర్ . పరీక్ష ప్రారంభం అయినా కాసేపటికే లీక్ ఘటన వెలుగులోకి రావడమా తో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు .
దీనిపై చిత్తూరు జిల్లా కలెక్టర్‌తోపాటు విద్యా శాఖ
దీనిపై చిత్తూరు జిల్లా కలెక్టర్‌తోపాటు విద్యా శాఖ స్పందించి కొందరు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. పరీక్షలు ప్రారంభమైన గంటలోపే వాట్సాప్‌ల్లో పుకార్లకు తెరలేపారని విద్యా శాఖ అధికారులు తెలిపారు .. దీనిపై జిల్లా ఎస్పీ విచారణ చేస్తున్నారని డీఈవో స్పష్టం చేశారు.
ఇటు నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లెలో పదో తరగతి పేపర్ లీక్ అయ్యింది. పరీక్ష ప్రారంభం కంటే ముందే ప్రశ్నపత్రం వాట్సాప్‌లో లీక్ అయినట్లు తెలుస్తోంది. ఇన్విజిలేటర్, సూపర్ వైజర్ లీక్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రశ్నాపత్రం లీక్ ఘటనపై ప్రభుత్వం సైతం సత్వర చర్యలకు సిద్ధమైంది .
విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యా శాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు .ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సంబంధిత అధికారులను మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. పరీక్షలు ప్రారంభం అయిన రోజే ఇలా జరగడంపై అయన మండిపడ్డారు .
Share your comments