గత కొద్దీ సంవత్సరాలుగా ఆరోగ్య శాఖ లో ఖాళీగా ఉన్న ఆశ వర్కర్ల నియామకం పై అసెంబ్లీ లో ఆరోగ్య శాఖ మంత్రి కీలక ప్రకటన చేసారు , అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి హరీశ్ రావు శాసన సభ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ జీహెచ్ఎంసీ పరిధిలో 1540 ఆశా వర్కర్ పోస్టులకు ఫిబ్రవరి నెలలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు .
అదేవిధంగా బస్తీ దవాఖానాలతో ప్రజలకు మెరుగైన వైద్యం స్థానికంగానే అందుతోందని బస్తీల సుస్తి పోగొట్టేందుకు సీఎం కేసీఆర్.. బస్తీ దవాఖానాలు ప్రారంభించి అద్భుతమైన సేవలు అందిస్తున్నారని తెలిపారు.రూ. 800 విలువ చేసే లిక్విడ్ ప్రొఫైల్ టెస్ట్ 1.48 లక్షల మందికి, థైరాయిడ్ పరీక్షలు లక్షా 800 మందికి చేశామన్నారు.
ప్రస్తుతం బస్తీ దవాఖానాల్లో 57 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామని , వీటిని త్వరలో 134 రకాల పరీక్షలకు పెంచుతామని మంత్రి హరీశ్ రావు చెప్పారు. 158 రకాల మందులు ఉచితంగా ఇస్తున్నామన్నారు. ఆదివారం కాకుండా శనివారం బస్తీ దవాఖానాలకు సెలవు ఇస్తున్నామని చెప్పారు.
ఫిబ్రవరి 14 " కౌ" హగ్ డే ఉత్తర్వులు రద్దు చేసిన కేంద్రం
బస్తి దవాఖానాలు స్థానికంగా సేవలందిస్తుండటంతో ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లాంటి పెద్ద ఆస్పత్రుల్లో ఓపి తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయని తెలిపారు. ఉస్మానియాలో 5 లక్షల మంది (60%), గాంధీ 2019లో 3.7 లక్షల మంది (56%), నీలోఫర్ 5.3 లక్షలు (44%), ఫీవర్ ఆసుపత్రిలో లక్ష 12 వేలు (72%) ఓపీ తగ్గిందని, అదే సమయంలో శస్త్ర చికిత్సల సంఖ్య గణనీయంగా పెరిగిందని మంత్రి హరీశ్ రావు వివరించారు.
Share your comments