News

18 ఏండ్లు నిండాయా? ఓటరుగా నమోదు చేసుకోండి ..

Srikanth B
Srikanth B

ఓటు హక్కు సామాన్యుని ఆయుధం , ఏ స్థాయివారికైన "ఒకే ఓటు ..ఒకే విలువ " ఏది రాజ్యాంగం భారత పౌరులకు అందించిన అత్యంత విలువైన హక్కు భారతదేశం లో 18 నిండిన ప్రతి పౌరుడు ఓటు హక్కు , ప్రతి పౌరుడు రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ 2023 ప్రకారం జనవరి 1 తేదీ 2023 నాటికి 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి ఒకరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?

www. nvsp.inఅనే వెబ్‌ సైట్‌లో నూతన ఓటరు అయితే ఫారం 6 ద్వారా దరఖాస్తు నమోదు చేసుకోవాలి.

ఇంతకు ముందు ఓటరు జాబితాలో పేరు నమోదై ఉన్న వారు ఫాం 6బీ ద్వారా నమోదు చేసుకోవాలి.

18 సంవత్సరాలు నిండిన ఓటరు, జాబితాలో పేరు లేని వారు నమోదుకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ రాష్ట్ర ఎన్నికల సీఈవో ఇచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కోరారు. ప్రస్తుత ఓటరు జాబితాలో పేరు ఉన్న వారు మార్పులు, చేర్పుల కోసం ఫారం-8 వినియోగించుకోవాలి. ఓటరు జాబితాలో ఇంటి అడ్రస్‌, ఎన్నికల ఫొటో గుర్తింపు కార్డులో తప్పులు సరి చేసుకోవడం, పోగొట్టుకుంటే, చినిగిపోయినా.. మరొకటి తీసుకోవడం కోసం ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఓటరు జాబితాలోని పేరు తొలగింపునకు ఫారం 7 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని కమిషనర్‌ సూచించారు.

పద్మ అవార్డులు-2023కు నామినేషన్లు 15 సెప్టెంబర్ చివరి గడువు..

ఈ నమోదు సందర్భంగా అభ్యర్థులు (నూతన ఓటరు, ఇంతకు ముందు ఓటరు జాబితాలో పేరున్న వారు) కూడా ఆధార్‌ కార్డు ఉన్న వారు ఇష్టముంటే ఆధార్‌ జత చేయాలి. లేని సమక్షంలో ఎన్నికల కమిషన్ ద్వారా సూచించబడిన 11 పత్రాల్లో ఏదైనా ఒకటి జత చేయాలి. అదే విధంగా ఆధార్‌ కార్డులేని వారు కూడా సూచించబడిన 11 ధ్రువ పత్రాల్లో ఏదో ఒకటి జోడించి నమోదుచేసుకోవచ్చు . లేనిచో ఆఫ్‌ లైన్‌ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు. దరఖాస్తులు, అవసరమైన ధ్రువీకరణ పత్రాలు పోలింగ్‌ బూత్‌ లెవెల్‌ వద్ద ఈఆర్‌వోకు అందచేయాలి.

పద్మ అవార్డులు-2023కు నామినేషన్లు 15 సెప్టెంబర్ చివరి గడువు..

Share your comments

Subscribe Magazine

More on News

More