దేశం గణతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్న సమయంలో అప్పటి చరిత్రను గుర్తు చేసుకుంటూ 1947 సంవత్సరం
17 సెప్టెంబర్ నాటి రైల్వే టికెట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది .
ఈమధ్య కాలంలో స్వతంత్రం ముందు సందర్భాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న కొన్ని వస్తువుల ధరలు వైరల్ గ మారుతున్నాయి , గత కొన్ని రోజుల క్రితం 1950 నాటి గోధుమల ధరలకు సంబందించిన పోస్టు వైరల్గా మారగా ,గత కొద్దీ రోజుల క్రితం పాత సైకిల్ ధర కూడా వైరల్ గ మారింది అదే క్రమంలో ఇప్పుడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాకిస్థాన్ రైల్ లవర్స్ ఫేస్బుక్ పేజీ పై పోస్టు చేయబడిన 1947 సెప్టెంబర్ 17 నటి రైలు టికెట్ ధర వైరల్ మారింది .
అప్పట్లో టికెట్ ధర ఎంతో తెలుసా.. జస్ట్ 36 రూపాయల 9 అణాలు మాత్రమే. అంటే అప్పట్లో భారత్-పాకిస్థాన్ మధ్య రైల్వే ఛార్జీలు ఒక్కొక్కరికి రూ.4 మాత్రమేనని టిక్కెట్టు చూస్తే అర్థమవుతుంది. ఆశ్చర్యకరంగా, ఈ టికెట్ థర్డ్ ఏసీ, ఇది వన్-వే జర్నీకి సంబంధించినది.
ఈ పోస్టు పై వేలలో స్పందనలు వస్తున్నాయి ఇప్పటికి 17 వేల లైక్ లు మరియు వేలలో షేర్ చేస్తున్నారు అదేవిధముగా స్పందిస్తూ ఓల్డ్ డేస్ గోల్డెన్ డేస్ అని చెబుతుంటే మరికొందరు అప్పటి ధరకు ఇప్పటి ధరకు లెక్కలేస్తూ కామెంట్లు చేస్తున్నారు . ఏదిఏమైనప్పటికీ గణతంత్ర దినోత్సవం రోజున ఒకప్పటి భారత దేశా ఆర్థిక వ్యవస్థకు ఈ రైల్వే టికెట్ ఉదాహరణగా నిలుస్తుంది .
Share your comments