దేశంలో పెరుగుతున్న ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం అయ్యిందని , దేశంలో పెరుగుతున్న ధరల భారం నిరుపేదలపైనే అధికంగా పడుతుందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు.
పెరుగుతున్న ధరలతో ఇబ్బందులు పడుతున్న నిరుపేదలను గాలికి వదిలేసి పేదల దృష్టి మళ్లించేందుకు ..ఇతర సమస్యలను సృష్టిస్తున్నారని , దృష్టి దీనిపై కాకుండా ధరలను తగ్గించడంలో ద్రుష్టి సారించాలని సూచించారు.
'వెళ్లిన చోట సంబంధం లేని విషయాలు మాట్లాడటం కాదు ప్రజలు సమస్యల గురించి మాట్లాడండి ద్రవ్యోల్బణం దోపిడీ నుంచి ప్రజల దృష్టి మరల్చాలని మోదీ అనుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న ఈ భారీ దోపిడి వల్ల.. దేశంలోని 20శాతం మంది అత్యంత పేదలు ఈ భారాన్ని మోయాల్సి వస్తోంది. ఆహార పదార్థాల ధరల ఆకాశాన్నంటుతున్నాయి. వీటన్నింటికీ ఒకే ఒక్క కారణం భాజపానేనని దేశ పౌరులు గుర్తించారు' అని ఖర్గే పేర్కొన్నారు.
ఆగస్టు నెలలో గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 7.2శాతంగా ఉందన్న ఆయన.. నగరాల్లో 7.6శాతంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు సంపన్నుల ద్రవ్యోల్బణం మాత్రం 6.7శాతంగానే ఉందన్నారు.
Share your comments