కాంగ్రెస్ పార్టీ ఆరు హామీలను తమ ప్రాథమిక లక్ష్యాలుగా ప్రకటించి రాబోయే ఎన్నికలపై దృష్టి సారించింది. తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఈ హామీలను ప్రకటించారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను తప్పమని సోనియా గాంధీ తెలిపారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి దానికి అభివృద్ధి చేసే బాధ్యత కూడా ఉందని ఆమె తెలియజేసారు. అధికారం చేపట్టిన తొలి నెలలోనే తమ పార్టీ చేసిన వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తానని సోనియా గాంధీ ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు:
1. మహాలక్ష్మి పథకం:- మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు నెలవారీ సహాయం కింద రూ.2000తో సహా అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుంది.ఈ ఆర్థిక సహాయంతో పాటు ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణానికి కూడా అర్హులు. దీనితోపాటు మహిళలకు కేవలం రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తామని తెలిపారు.
2. రైతుభరోసా:- రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సహాయం అందించాలనే లక్ష్యంతో రైతులకు మరియు కౌలురైతులకు ప్రతి సంవత్సరం రూ. 15,000 పంట పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించింది. వారితోపాటుగా వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ. 12,000 సాయం అందిస్తామని తెలిపారు. వరి పంటకు ప్రతి క్వింటాల్‌కు రూ. 500 బోనస్.
3. గృహజ్యోతి:- గృహజ్యోతి ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు వినియోగానికి ఎటువంటి ఖర్చు లేకుండా విద్యుత్ పొందే ప్రయోజనాన్ని అందిస్తుంది.
ఇది కూడా చదవండి..
విశ్వకర్మ' పథకం ప్రారంభం.. వారికి రూ. లక్ష రుణం..! ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి..
4. ఇందిరమ్మ ఇండ్లు:- ఇందిరమ్మ గృహాల కార్యక్రమం ఇల్లు లేని వారికి రూ.5 లక్షల నగదును ఇళ్లను నిర్మించి సహాయం అందించడంపై దృష్టి సారించింది. అదనంగా, ఉద్యమకారుల కుటుంబాలకు 250 చదరపు గజాల స్థలం మంజూరు చేస్తామని తెలిపింది.
5. యువ వికాసం:- యూత్ డెవలప్‌మెంట్ విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా బీమా కార్డు మరియు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు.
6. చేయూత:- నెలకు రూ. 4,000 చొప్పున పింఛను. రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పథకం కింద, చేనేత కార్మికులు 10 లక్షల వరకు ఆరోగ్య బీమా కవరేజీకి అర్హులు.
ఇది కూడా చదవండి..
Share your comments