News

నిరుద్యోగులకు శుభవార్త .

KJ Staff
KJ Staff

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన వాటర్‌ రిసోర్సెస్‌ డిపార్ట్‌మెంట్‌ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 15లోగా అప్లై చేసుకోవాలి నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వానికి చెందిన వాటర్‌ రిసోర్సెస్‌ డిపార్ట్‌మెంట్‌ గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అధికారులు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 7 ఖాళీలను భర్తీ చేయనున్నారు. హైడ్రాలజిస్ట్, కెమిస్ట్ ఎక్స్పర్ట్, అకౌంటెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ విభాగంలో ఈ నియామకాలు చేపట్టినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. పోస్టుల ఆధారంగా ఆయా ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.15 వేల నుంచి రూ. 56 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. అయితే ఎంపికైన వారు ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన పని చేయాల్సి ఉంటుంది.

ఖాళీలు, విద్యార్హతల వివరాలు.

హైడ్రాలజిస్ట్‌: ఈ విభాగంలో ఒక ఖాళీలని భర్తీ చేస్తున్నారు. సివిల్ ఇంజనీరింగ్ లో బీటెక్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. హైడ్రాలజీ విభాగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి. లేదా వాటర్ రిసోర్సెస్ విభాగంలో ఎంటెక్‌ ఉత్తీర్ణత సాధించి హైడ్రాలజీలో ఏడాది అనుభవం ఉన్నవారు కూడా ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు విజయవాడలో పని చేయాల్సి ఉంటుంది. నెలకు రూ. 56 వేల వేతనం ఉంటుంది.

కెమిస్ట్‌ ఎక్స్‌పర్ట్:‌ విభాగంలో మూడు ఖాళీలు ఉన్నాయి. కెమిస్ట్రీ విభాగంలో బీఎస్సీ లేదా ఎమ్మెస్సీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. అభ్యర్థులకు రెండేళ్ల ల్యాబ్ అనుభవం ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.24,500 వేతనం చెల్లించనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు గుంటూరు, కడపలోని క్యాలిటీ ల్యాబ్ లో పని చేయాల్సి ఉంటుంది.

అకౌంటెంట్‌: ఈ విభాగంలో మరో ఖాళీని భర్తీ చేయనున్నారు. ఎంకాం లేదా బీకాం పాసైన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు విజయవాడ పని చేయాల్సి ఉంటుంది. నెలకు రూ. 17, 500 వరకు వేతనాలు చెల్లిస్తారు.

డేటా ఎంట్రీ ఆపరేటర్: ఈ‌ విభాగంలో ఒక ఖాళీలని భర్తీ చేస్తున్నారు. ఏదైనా సబ్జెక్ట్ లో డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. అభ్యర్థులకు కంప్యూటర్ పై అవగాహన తప్పనిసరి. ఎంపికైన వారికి నెలకు రూ. 15 వేల వేతనం చెల్లించనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు కూడా విజయవాడలో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు Resume తో పాటు అనుభవానికి సంబంధించిన ధ్రువపత్రాలను hydrology@ap.gov.in కు మెయిల్ ద్వారా పంపాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ ఏప్రిల్ 15 ని నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ రోజు సాయంత్రం 5 గంటల లోగా అప్లై చేయాల్సి ఉంటుంది.

Share your comments

Subscribe Magazine

More on News

More