రాజ్య సభ లో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి అయిన నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ దశల వారిగా 6 రకాలను ఎప్పటికీ వాడకుండా పూర్తిగా నిషేదించినట్లు, 12 రకాల హానికర పురుగుమందులను ఇప్పటికే నిషేధించినట్లు చెబుతూ మరో 27 రకాల పురుగు మందులు నిషేదనకూ పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. కాగా దీని కోసం ఇప్పటికే ఒక నిపుణుల కమిటీ నియమించినట్లు తెలిపారు.
కేంద్ర మంత్రి రాజ్యసభకు సమర్పించిన నివేదికలో ఆ పురుగుల మందుల వివరాలు ఇలా ఉన్నాయి... అస్ఫేట్, అట్రాజిన్, బెన్‌ఫురాకార్బ్, బుటాచ్లోర్, కెప్టన్, కార్బెండజిమ్, కార్బోఫ్యూరాన్, క్లోర్‌పైరిఫోస్, 2,4-డి, డెల్టామెత్రిన్, డికోఫోల్, డైమెథోయేట్, డైనోకాప్, డైయురాన్, మలాథియాన్, మాన్‌కోజెబ్, మోనోఫైల్, మోతోమైఫ్ సల్ఫోసల్ఫ్యూరాన్, థియోడికార్బ్, థియోఫనాట్ ఎమెథైల్, తిరామ్, జినెబ్ మరియు జిరామ్.
వీటినీ గుర్తించడానికి అనుపమ్ వర్మ కమిటీ 66 రకాల పురుగుమందులను పరిశీలించినట్లు ఆయన తెలిపారు. దీని ప్రకారం, తగిన విధానాన్ని అనుసరించి, 12 పురుగుమందులను పూర్తిగా నిషేధించారు మరియు మరో ఆరు పురుగుమందులను దశలవారీగా తొలగించారు.
Share your comments