News

మొరాకోలో భారీ భూకంపం 296మంది మృతి.. సంతాపం ప్రకటించిన ప్రధాని

Srikanth B
Srikanth B
మొరాకోలో భారీ భూకంపం 296మంది మృతి.. సంతాపం ప్రకటించిన ప్రధాని
మొరాకోలో భారీ భూకంపం 296మంది మృతి.. సంతాపం ప్రకటించిన ప్రధాని

శుక్రవారం రాత్రి 11:11 నిమిషాలకు మొరాకోలో భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 296మంది మరణించారు 150 మందికి పైగా క్షతగాత్రులైయ్యారు ఇప్పటికి శిధిలాలను తొలగిస్తున్నారు దీనితో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

నైరుతి మర్రాకేశ్​ ప్రాంతంలో భూమికి 18.5కిమీల దిగువన.. శుక్రవారం రాత్రి 11:11 గంటలకు భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.8 గ నమోదైయింది. మొరాకో భూకంపం సంభవించిన ప్రాంతంలో జనాభా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడి భవనాలకు.. భూ ప్రకంపనలను తట్టుకునే సామర్థ్యం లేదని తెలుస్తోంది. తాజా ప్రకృతి విపత్తుతో అనేక భవనాలు దెబ్బతిన్నట్టు తెలుస్తోంది.

ఈ ఘటనపై దేశ ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ .. మృతులకు కుటుంబాలకు తన సంతాపాన్ని తెలిపారు , అదేవిధంగా దేశం నుంచి అవసరైయ్యే అన్ని రకాల సాయమా అందిస్తామని ఆర్థికంగా మొరాకోకు చేయూత అందిస్తామని ప్రధాని ప్రకటించారు.

PMVVY Scheme Update : ఈ పథకం లో చేరితే .. నెల నెల రూ.9,

ప్రధాని ట్విట్టర్లో ఇలా పేర్కొన్నారు “మొరాకోలో భూకంపం కారణంగా ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. ఈ విషాద సమయంలో, నా సాయం మొరాకో ప్రజలకు ఉంటాయి . తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి సంతాపం . గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఈ క్లిష్ట సమయంలో మొరాకోకు అన్ని విధాలా సహాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉంది. అని ట్విట్టర్ ద్వారా తన సంతాపాన్ని ప్రధాని ప్రకటించారు.

PMVVY Scheme Update : ఈ పథకం లో చేరితే .. నెల నెల రూ.9,250 పెన్షన్!

Related Topics

Earthquake

Share your comments

Subscribe Magazine

More on News

More