రానున్న నాలుగు రోజులపాటు రాష్ట్రంలో ఒక మోస్తరు వర్షాలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచనలు జారీ చేసింది , రానున్న శని ,ఆది ,సోమ వారాలలో రాష్ట్రవ్యాప్తంగా ఒక మోస్తరు వర్షాలు కురిసే అవక్షం ఉందని , సోమవారం కొన్ని ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది . మరోవైపు రాష్ట్రంలో ఎండలు ,వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుందని , వడగాలుల ఉదయం 7 గంటలనుంచే ప్రారంభం అవుతాయని తెలిపింది .
వైఎస్సార్ బీమా పథకం నమోదు ప్రారంభం .. జూన్ 7 వరకు పూర్తి !
రాగల 24 గంటలు రాష్ట్రంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని తెలిపింది. పగటి గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 28 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. వాయవ్యం, పడమర దిశల నుంచి వీస్తున్న గాలులతో రాష్ట్రంలో ఎండలు, వడగాల్పులు పెరిగాయి. ఉదయం 7 గంటల నుంచే వేడిగాలులు మొదలై, మధ్యాహ్నం తీవ్రం అవుతున్నాయి. శుక్రవారం అన్ని జిల్లాల్లో గరిష్ఠ పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి.
Share your comments