News

నేటితో అందుబాటులోకి 5G సేవలు..

Srikanth B
Srikanth B
5G services to be launched today..
5G services to be launched today..

నేటి ఇంటర్నెట్ యుగం లో ఇంటర్నెట్ సర్వీస్ సేవలు వేగాన్ని పెంచుకుంటూన్నాయి మొదట 2G తో మొదలుకొని 5G వరకు మొబైల్ రంగ సంస్థలు వినియోగదారులకు అత్యంత వేగవంతమైన సేవలను అందించడానికి సిద్ధం అవుతున్నాయి . దీనిలో భాగం గ 5G సేవలను ఈ నెల తో అందుబాటు లో తీసుకు రానున్నాయి , దేశంలో 5జీ సేవలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం అధికారికంగా ప్రారంభించనున్నారు. దిల్లీ ప్రగతి మైదాన్‌లో అక్టోబరు 1-4 తేదీల్లో జరగనున్న 6వ ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌-2022 కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు 5జీ సేవల ను సైతం ప్రధాని ప్రారంభించనున్నారు .

మొదట ఏ నగరాలలో అందుబాటులో ఉంటాయి ?
5G మొదటి దశలో ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, చండీగఢ్, గురుగ్రామ్, హైదరాబాద్, లక్నో, పూణే, గాంధీనగర్, అహ్మదాబాద్ మరియు జామ్‌నగర్‌లతో సహా 13 నగరాలలో అందుబాటులో రానున్నాయి .

 


5.G స్పెక్ట్రమ్ ధర ?

ప్రస్తుత 4జీతో పోలిస్తే 7-10 రెట్ల డేటా వేగం 5జీ సేవల్లో లభిస్తుందని, కొత్త ఆర్థిక అవకాశాలు, సామాజిక ప్రయోజనాలు సాధ్యపడతాయని చెబుతున్నారు. దేశంలోని 3 ప్రైవేటు టెలికాం సంస్థలు 5జీ సేవల కోసం రూ.1.5 లక్షల కోట్ల స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేశాయి. జియో రూ.88,078 కోట్లు, ఎయిర్‌టెల్‌ రూ.43,084 కోట్లు, వొడాఫోన్‌ ఐడియా రూ.18,799 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేశాయి.

తెలంగాణలో ఎస్టీ కోటాను 10 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ...

Related Topics

5G services Jio Jio 5G

Share your comments

Subscribe Magazine

More on News

More