పాకిస్థాన్ ను తీవ్ర సంక్షోభం వెంటడుతుంది , గత సంవత్సరం నుంచి పాకిస్థాన్ ఆర్థికంగా రోజురోజుకు బలహీనపడుతూవస్తోంది కనీసం తినడానికి తిండి దొరకని స్థితిలోకి దేశ పరిస్థితి దిగజారుతోంది గతంలో గోధుమ పిండికొసం తొక్కిసలాట జరిగి ఇద్దరు చనిపోగా చాలామందికి తీవ్ర గాయాలు అయ్యాయి ఇప్పుడు అలాంటి ఘటన మరోసారి కరాచీలో ఉచిత రేషన్ తీసుకునే సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 12 మంది మృతి చెందగా , పలువురు గాయపడ్డారు.
కరాచీలోని SITE పారిశ్రామిక ప్రాంతంలో శుక్రవారం ఆహార రేషన్ కోసం ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థ పంపిణీ సందర్భంగా దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రతి సంవత్సరం రంజాన్ సందర్భంగా.. ఈ స్వచ్ఛంద సంస్థ కరాచీలోని పేద ప్రజలకు సహాయం చేయడానికి ఆహార వస్తువులను ఉచితంగా పంపిణీ చేస్తుంది. రెస్క్యూ డిపార్ట్‌మెంట్, పోలీస్ డిపార్ట్‌మెంట్ వర్గాల ప్రకారం.. మృతులలో ఎనిమిది మంది మహిళలు, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
మిగిలిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తొక్కిసలాటలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురు పిల్లలతో సహా 11 మంది చనిపోయారు. మృతి చెందిన వారిలో ఎనిమిది మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారని నివేదిక పేర్కొంది. తొక్కిసలాటలో మరో ఆరుగురు స్పృహతప్పి పడిపోయారు.
తెలంగాణ రైతులకు శుభవార్త .. వడ్లు కొనుగోళ్లపై కీలక నిర్ణయం..!
పాకిస్థాన్ లో ప్రస్తుతం 20 కిలోల గోధుమ ధర 3000 దాక వుంది ..అంటే కిలో గోధుమ పిండి ధర దాదాపు 150 అన్నమాట .. మరోవైపు పాకిస్తాన్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళా కనీసం ఎన్నికలు నిర్వహించడానికి కూడా ఆ దేశం వద్ద డబ్బులు లేకపోవడం ఆ దేశం యొక్క పరిస్థితిని అడ్డం పడుతుంది .
Share your comments