హైదరాబాద్ స్టేట్ ను పాలించిన చివరి నిజాం వారసుడు హైదరాబాద్ ఎనిమిదో నిజాం నవాబ్ మీర్ బర్కత్ అలీ ఖాన్ వాలాషన్ ముకర్రం జా బహదూర్ (89) కన్ను మూశారని ఆయన ఆఫీసు ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు.
1933లో జన్మించిన మిర్ బర్కత్ అలీ ఖాన్ కుటుంబంతో సహా టర్కీలో నివాసం ఉంటున్నారు. ఇస్తాంబుల్ లో ఆయన 15 వ తారీకు రాత్రి 10.30 గంటలకు కన్నుమూశారు. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కు మిర్ బర్కత్ అలీ ఖాన్ మనవడు.
మిర్ బర్కత్ అలీ ఖాన్ చివరి కోరిక మేరకు ఆయన అంత్యక్రియలను హైదరాబాద్ లోనే నిర్వహిస్తామని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. రేపు మిర్ బర్కత్ అలీ ఖాన్ పార్థివదేహంతో ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ చేరుకోనున్నారు. ''హైదరాబాద్ కు చేరుకున్న అనంతరం మిర్ బర్కత్ అలీ ఖాన్ పార్థివదేహాన్ని చౌమహల్లా ప్యాలెస్ కు తరలిస్తాం. సంప్రదాయం ప్రకారం అన్ని కార్యక్రమాలు పూర్తి చేశాక.. అసఫ్ జాహి కుటుంబ సమాధుల వద్ద అంత్యక్రియలు నిర్వహిస్తాం'' అని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు.
ఊరి పై ఏనుగుల దాడి .. ఒకరు మృతి
మిర్ బర్కత్ అలీ ఖాన్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూలి తెలిపారని సీఎంవో ఓ ప్రకటనలో పేర్కొంది. ఆయన అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరిపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి కేసీఆర్ ఆదేశించారని సీఎంవో తెలిపింది.
Share your comments