తమిళనాడులోని కడలూరు జిల్లాలోని పన్రుటి, ప్రత్యేకమైన సువాసన మరియు రుచిని కలిగి ఉండే పనస పండు భారతదేశం మరియు విదేశాలలో ప్రసిద్ధి చెందింది.
"ఆయిరం కైచి" అని పిలువబడే ఈ చెట్టు 2011లో థానే తుఫాను సమయంలో పన్రుటి తీవ్రంగా ప్రభావితమైనప్పుడు కూడా మనుగడ సాగించింది. ఈ చెట్టు పన్రుటి సమీపంలోని మలిగంపటైకి చెందిన 72 ఏళ్ల రైతు రామసామికి చెందినది. 5 ఎకరాల్లో ఉన్న తన పొలంలో జాక్‌ఫ్రూట్స్, మామిడి, జీడి, జామ, చింతపండు చెట్టులను పెంచుతున్నాడు .
మీడియాతో రామసామి మాట్లాడుతూ.. ఈ తోట మా వారసత్వ సంపద.. మా పూర్వీకులు నాటిన ఒకే ఒక్క జాక్‌ఫ్రూట్ చెట్టు ఇప్పటికీ బలంగా ఉంది. ప్రతి సంవస్తరం చెట్టుకు వెయ్యి కి పైగా పూతలు వస్తాయి అయితే అందులో కేవలం 300 వందలకు పైగా కలను ఉంచి మిగిలిన వాటిని కత్తిరిస్తాము ఎందుకంటే అన్ని కాయలు ఒకే సరి వస్తే కయ పెరుగుదల అనేది సరిగా ఉండదు.
ఈ చెట్టు యొక్క ప్రతి జాక్‌ఫ్రూట్ 10 నుండి 80 కిలోగ్రాముల బరువు ఉంటుంది మరియు ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది.
థానే తుఫాను కారణంగా ఏర్పడిన విధ్వంసాన్ని గుర్తుచేసుకుంటూ రామస్వామి ఇలా అన్నాడు: "ఈ 200 ఏళ్ల నాటి జాక్‌ఫ్రూట్ చెట్టు కూడా స్వల్పంగా దెబ్బతింది. మూడు సంవత్సరాల తర్వాత 'ఆయిరం కైచి' చెట్టు మాత్రమే ఫలాలను ఇవ్వడం ప్రారంభించింది మరియు ఇది ప్రతి సంవత్సరం కాయలను ఇస్తుంది .
అధిక దిగుబడినిచ్చే 10 ఉత్తమ వరి రకాలు !
చిన్న రైతులు భారీ యంత్రాలను తీసుకోవచ్చు: తెలంగాణ వ్యవసాయ మంత్రి
జాక్‌ఫ్రూట్ మామిడి మరియు అరటితో పాటు తమిళనాడు యొక్క గౌరవనీయమైన పండ్లలో ఒకటి మరియు ప్రాచీన తమిళ గ్రంథాలు మరియు సాహిత్యంలో ప్రస్తావించబడింది.
Share your comments