News

ధరలు లేక 4 టన్నుల మామిడిపళ్ళను ఉచితంగా పంచేసిన రైతు

Sriya Patnala
Sriya Patnala
farmer Distributed 4 tonnes mangoes for free in protest to low prices by buyers
farmer Distributed 4 tonnes mangoes for free in protest to low prices by buyers

ఏలూరు: ఒక రైతు , 4 టన్నుల మామిడి పళ్ళను, టాక్టర్ లో తీసుకొచ్చి, జనాలకు ఉచితంగా పంచేసాడు. పళ్ళను అమ్మడానికి మార్కెట్ కు టిస్కెల్లిన రైతుకి, అక్కడ దళారులు ఇచ్చే ధర చూసి విచారించి, అమ్మకుండానే వెనక్కు టిస్కోచి ఆ ప్రాంతంలో ప్రజలకు
ఉచితం గా ఇచ్చేసాడు. తన నిరసనను ఈ విధంగా తెలియచేస్తున్న, అధికారులు ఇప్పటికైనా స్పందించాలి అని అన్నాడు రైతన్న

ఏలూరు జిల్లాకు చెందిన బెక్కం రాజగోపాలరావు అనే రైతు 4 ఎకరాల్లో మామిడి తోట వేసి పండించాడు .పంట అమ్మడానికి మార్కెట్ కు తీసుకెళ్తే, తన మామిడి పండ్లకు దళారులు అతి తక్కువ ధర పలకడంతో మనస్తాపానికి గురయ్యాడు. కష్టపడి పండించిన పంటను దళారులకు విక్రయించడం ఇష్టం లేక, ధరలను అదుపు చేస్తున్న దళారులకు నిరసనగా 4 టన్నుల మామిడి పండ్లను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించారు. తనకు తెలిసిన వారితో ట్రాక్టర్‌పై ఉచితంగా మామిడి పండ్లను పంపిణీ చేశాడు.

నాలుగెకరాల పొలంలో మామిడి సాగు చేసేందుకు 50-70 వేళా పెట్టుబడి పెట్టి సాగు చేస్తే ,మార్కెట్ లో టన్నుకు 5-12 వేలు మాత్రమే ధర పలుకుతుంది . దళారులు అందరు కుమ్మక్కై రైతులను నష్టపరుస్తున్నారు. కనీసం పెట్టు బడి ధర కూడా రాకుండా చేస్తున్నారు . ఇది చుసైనా అధికారులు స్పందించి మామిడి పంటను మూడు గ్రేడ్లుగా విభజించాలని డిమాండ్ చేశారు.

ధరలను అదుపు చేస్తున్న దళారుల వల్ల పంట పెట్టుబడి నష్టపోతున్నామని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. అకాల వర్షాలవళ్ళ మామిడి తోటల్లో ,మంగు మసి వచ్చి మామిడికాయలు పాడైపోతున్నాయని,దీన్ని ఆసరాగా చేసుకొని దళారులు తక్కువ ధరకు అడుగుతున్నారని తెలిపారు. ఇప్పటికే అకాల వర్షాలతో రైతులు నష్టపోయారు.ఇప్పుడు దళారుల కారణంగా ఇంకా నష్టాల్లోకి కూరుకుపోతున్నారు. వర్షం కారణంగా మామిడి రైతులు మామిడి పంటలు పండక ఇబ్బందులు పడ్డారు, వాటివల్ల మామిడి కాయలు రాలిపోయాయి.పైగా మంగు మసి ఏర్పడ్డాయి. దీంతో మామిడి పండ్లను కొనుగోలు చేసే వారు కనీస ధర కూడా ఇవ్వకుండా అధికారం చేస్తున్నారు. అధికారులు ఈ విషయం పై స్పందించి రైతులకు న్యాయం చేయాలని అయన వాపోయారు.

ఇది కూడా చదవండి

45 ప్రాంతాల్లో రోజ్ ఘర్ మేళ.. 71,000 మంది నిరుద్యోగులకు అపాయింట్‌మెంట్ లెటర్‌లు

Share your comments

Subscribe Magazine