మన సమాజంపై కరోనావైరస్ మహమ్మారి గణనీయమైన ప్రభావం చూపించింది, ముఖ్యంగా మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలకు భారీగా పెరిగిపోయాయి. వీటిలో ముఖ్యంగా వంట నూనె ధరలు మరీ దారుణంగా పెరిగిపోయాయి. ఈ మార్పుల యొక్క లోతైన విశ్లేషణను అందించడం ఈ సమయంలో చాలా అనవసరంగా ఉంటుంది.
ప్రస్తుత పరిస్థితి కొంతవరకు మెరుగుపడింది. రోజు రోజు పెరుగుతున్న ధరలతో సతమతమవుతున్న వినియోగదారులకు శుభవార్త అందించండి ప్రభుత్వం . అంతర్జాతీయ మార్కెట్లో నూనె ధరలు తగ్గు ముఖం పడుతున్న వేళ వంట నూనెల ధరలను తక్షణమే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రధాన వంట నూనెల గరిష్ట రిటైల్ ధరను లీటరుకు రూ.8-12 తగ్గించాలని స్పష్టం చేసింది.
పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల కారణంగా సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజలు జీవనం సాగించలేక ఇబ్బందులు పడుతున్నారు. వారికి సరైన పరిష్కారం లేకుండా కేవలం ఓదార్పు మాటలు అందిస్తున్నారు. రాయితీపై వంటనూనెను అందుబాటులో ఉంచే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి..
ఒడిశా రైలు ప్రమాదం: భాదితులకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియాను ప్రకటించిన సిఎం
గత కొద్ది రోజులుగా వంటనూనె ధరలు తగ్గుముఖం పట్టాయి, అయితే సమీప భవిష్యత్తులో మరింత తగ్గే అవకాశం లేకపోలేదు. అయితే, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఉన్నవారికి సబ్సిడీని అందిస్తూ వంట నూనెలకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. లబ్ధిదారులు ఇప్పుడు వంటనూనెను తక్కువ ధరకు రూ.40కే ఒక కిలో వంటనూనె లభిస్తుంది. ఒక నెలకు సగటున కుటుంబానికి నాలుగు నుండి ఐదు లీటర్ల వంటనూనెను ఉపయోగిస్తారు. దీని వల్ల దాదాపు రూ. 200 నుంచి రూ.300 వరకు ఈ కుటుంబాలు ఆదా చేయవచ్చు.
అంతర్జాతీయ మార్కెట్లో నూనె ధరలు భారీగా పెరిగాయి దీనితో నూనె ధరలు దేశవ్యాప్తంగా భారీగ పెరిగిపోయాయి దీనితో సామాన్యుల జేబులకు చిల్లులు పడాయి .ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో నూనె ధరలు తగ్గుముఖం పడుతుండడంతో ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం ఉందని ఆహార మంత్రిత్వ శాఖ వెల్లడించింది . అయితే నూనె ధరల తగ్గుదల వార్త సామాన్యులకు కాస్త ఊరట కల్గించే అంశం .
ఇది కూడా చదవండి..
Share your comments