ఉదయం నుంచి ఒక వార్త తెలుగు రాష్ట్రమంతా చక్కర్లు కొడుతుంది .. వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి మండలం మొగిలిగుండ్లలో లో రైతు పొలం లో ఆకాశం నుంచి బెలూన్ సహాయంతో ఒక పరికరం పడడంతో అందరు ఆశ్చర్యానికి గురయ్యారు , చూడడానికి సినిమాలో చుపించే టైం మిషను పోలి ఉన్న పరికరం ఏంటా అని అందరు చర్చించు కుంటున్నారు . అయితే దీనికి సీసీ కెమెరాలను అమర్చబడి ఉండడం కూడా ఆశ్చర్యానికి గురి చేసింది అయితే ఈ వింత పరికరానికి సంబందించిన మిస్టరీ వీడింది .
ఆ పరికరం స్పెయిన్ దేశానికి చెందిందిగా ధృవీకరించారు సైంటిస్టులు. భారత ప్రభుత్వ సహకారంతోనే ఈ ప్రయోగం నిర్వహించినట్లు తెలుస్తోంది. స్పెయిన్ టూరిజంలో ఉపయోగించడానికి రూపొందించిన టూరిస్టులను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తరలించే పరికరంగా శాస్త్రవేత్తలు తెలిపారు .
తాజ్ మహల్ పై పరిశోధనకు పిటిషన్ వేస్తే రూ.1 లక్ష ఫైన్.. సుప్రీం కోర్టు
టాటా కన్సల్టెన్సీ వాళ్ళు రూపొందించిన ప్రయోగం ఈ పరికరం ద్వారా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది పూర్తిగా భారత ప్రభుత్వం సహాకారంతో నిర్వహించిన ప్రయోగం. ఇక్కడ ఈ ప్రయోగం విజయవంతం కావడంతో స్పేస్ దేశంలో టూరిజం లో టూరిస్టులను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తరలించే ఉపయోగపడుతుంది. దీనికి బెలూన్ సహాయంతో ప్రయోగించి పరీక్షించినట్లు .. రైతులు కలవరం చెందాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు .
Share your comments