మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. మహిళలకు ఆర్థికంగా చేయూత అందించేందుకు వివిధ పథకాలు ప్రవేశపెట్టింది. వ్యాపార రంగంలో రాణించాలనుకునే మహిళలకు బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు ఇప్పించడంతో పాటు మహిళల అభవృద్ధి కోసం అనేక స్కీమ్స్ తీసుకొచ్చింది. అలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల్లో ప్రధానమంత్రి మాతృ వందన యోజన ఒకటి. గర్భిణీ మహిళల కోసం కేంద్రం ఈ పథకం ప్రవేశపెట్టింది.
గర్భవతులకు ఈ పథకం ద్వారా రూ.5 వేలు అందిస్తోంది. వీటిని నేరుగా మహిళల బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తుంది. మూడు విడతలుగా ఈ డబ్బును అందిస్తుండగా.. ఇప్పటికే దేశవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు.
ఈ పథకం లక్ష్యం ఏంటి?
రోజువారీ కూలీపనిచేసే మహిళలు, వెనకబడిన వర్గాలకు చెందిన మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో పనులకు వెళ్లడానికి కుదరదు. ఆ సమయంలో ఆర్థిక సాయం అందించేందుకు కేంద్రం ఈ పథకం ప్రవేశపెట్టింది. అలాగే మహిళలు, నవజాత శిశువుల అభివృద్ధి కోసం ఈ పథకం అమలు చేస్తోంది.
ఈ పథకానికి ఎవరు అర్హులు?.. ఎవరు అనర్హులు?
-గర్భవతి అయిన మహిళలు మాత్రమే అర్హులు
-19 ఏళ్ల వయస్సు పైన ఉన్న మహిళలు మాత్రమే అర్హులు
-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులు అనర్హులు
ఎలా అప్లై చేసుకోవాలి?
-www.Pmmvy-cas.nic.in వెబ్‌సైట్ లోకి వెళ్లి అప్లై చేసుకోవాలి.
-ఆ వెబ్ సైట్ లో బెనిఫీషియరీ లాగిన్ అనే ట్యాబ్ మీద క్లిక్ చేయాలి
-ఆ తర్వాత రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయి మీ వివరాలు ఇవ్వాలి
-ఇక ఆశా వర్కర్ ద్వారా కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు.
-అంగన్ వాడీ కేంద్రాల్లో కూడా అప్లై చేసుకోవచ్చు
డబ్బులు ఎప్పుడెప్పుడు ఇస్తారు?
-గర్భం దాల్చిన 150 రోజుల్లోపు తొలి విడతగా రూ.వెయ్యి ఇస్తారు
-180 రోజుల్లో రెండో విడత కింద రూ.2 వేలు అందిస్తారు
ఇక డెలివరీ తర్వాత మూడో విడతగా రూ.2 వేలు జమ చేస్తారు.
Share your comments