News

వ్యవసాయ స్టార్ట్-అప్ లకు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద రూ.25 లక్షలు

Srikanth B
Srikanth B

స్టార్టప్ అగ్రి-బిజినెస్ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్, వ్యవసాయ అనుబంధ రంగలలో వ్యాపారం చేయదలచిన్న వారికీ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద రూ.25 లక్షలు రూపాయల వరకు ఆర్ధిక సహాయం అందించనున్నారు. మీ వ్యాపారానికి అనుకూలమైన ప్రోత్సహం లభిస్తుంది మరియు లబ్ధిదారుల ను గుర్తించడానికి ఒక్క కమిటీ నియమించబడింది, అభ్యర్థులను ఎంపికచేయడం లో ఈ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది. లబ్ధిదారులు వారి వారి వ్యాపారాలను విస్తరించడానికి కావాల్సిన సహకారాన్ని అందిస్తుంది , అదే విధం గ బ్యాంకు రుణాలను అందించడానికి కావాల్సిన సహకారాన్ని అందిస్తుంది .

అర్హతా ప్రమాణాలు

  • దరఖాస్తుదారుడు భారతదేశ పౌరుడై ఉండాలి
  • ప్రాజెక్ట్ కు సంబందించిన DPR ఉండాలి
  • డిపిఐఐటి నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తుదారుడు భారతీయ స్టార్ట్-అప్ గా ఉండాలి.
  • ఇంతక ముందు ఈ పథకం ద్వారా లబ్ది పొంది ఉండకూడదు .
  • స్టార్టప్ కోసం  ఏ రాష్ట్ర/ కేంద్ర ప్రభుత్వ సంస్థల నుండి గ్రాంట్-ఇన్-ఎయిడ్ నిధులను పొందకూడదు.

ఎంపిక ప్రక్రియ 

MANAGE: సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ మరియు అగ్రిప్రెన్యూర్ షిప్ విభాగం అభ్యర్థులను ఎంపిక చేయడానికి ఒక కమిటీ ను నియమిస్తుంది , ఈ  కమిటీ  ఎంపిక ప్రక్రియ నుండి నిధుల విడుదల వరకు అభ్యర్థులకు కావాల్సిన  సహకారం అందిస్తుంది , దీనిని  రాష్ట్రీయ కృషి వికాస్ కేంద్రం  పర్వ్యవేక్షణ లో పని చేస్తుంది

 నిధుల విడుదల సరళి

ఈ పతకం లో లబ్ధిదారుడు తన మొత్తం ప్రాజెక్ట్ లో 15 శాతం పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది , మిగిలిన 85 శాతం  ప్రాజెక్టు వ్యయంలో మిగిలిన 85 శాతం గరిష్టంగా రూ. 25 లక్షల వరకు ఆర్ కెవివై-రాఫ్టార్ పథకం కింద భరించబడుతుంది.

  • మొదటి విడతలో 40% నిధులను  మౌలిక అవసరాల కొరకు విడుదలచేస్తారు .
  • రెండు విడతలో మొదటి విడత లో జరిగిన పనులను ఆధారంగా చేసుకొని కమిటీ నిర్ణయం మేరకు 40 శాతం  డబ్బులను విడుదలచేస్తారు
  • మిగిలిన 20 శాతాన్ని కమిటీ ప్రాజెక్టు పనులను పరిశీలించి విడుదల చేస్తారు .

Share your comments

Subscribe Magazine

More on News

More