పంట బాగా పండాలంటే విత్తనం బాగుండాలి. పంట బాగా పెరిగితే నాణ్యమైన దిగుబడులు వచ్చి, అధిక ధరలను పొంది రైతు సుభిక్షంగా ఉంటాడు. రైతుల మంచి కోరుతూ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసింది. రైతు అన్ని విధములుగా అభివృద్ధి చెందాలంటే రైతులకు ముఖ్యమైన విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల నాణ్యతను కాపాడాలనే లక్ష్యంతో ప్రభుత్వం వై.ఎస్.ఆర్ అగ్రిటెస్టింగ్ లాబ్స్లను ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలుస్తుంది.
ప్రభుత్వం రాయలసీమలో మొత్తానికి 48 అగ్రి ల్యాబ్‌లను మంజూరు చేసింది. వీటిలో నగరి జిల్లా కొరకు 6 ల్యాబ్‌లు ఉన్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన అగ్రి ల్యాబ్ కూడా చివరి దశ నిర్మాణంలో ఉంది. వీటితో పాటు పెనుమూరు, సోమలలో సైతం రెండు ల్యాబ్‌లు నిర్మాణంలో ఉన్నాయి. రైతులు తాము కొనుగోలు చేసిన విత్తనాలను మరియు ఎరువులను ఈ అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లో ఉచితంగా పరీక్షలు చేయించుకోవచ్చు. ఆ విత్తనాలను నాణ్యమైనవిగా నిర్ధారిస్తే వాటిని వాడుకోవచ్చు.
ఇప్పటి వరకు ఈ నగరి వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లో 359 పరీక్షలు నిర్వహించారు. ఎరువులకు సంబంధించి 117 యాక్ట్ శాంపిల్స్, ట్రేడ్ శాంపిల్స్ 5 ఈ ల్యాబ్స్ లో పరీక్షించారు. అవి అన్ని నాణ్యమైనవిగా నిర్ధారించారు. విత్తనాల నాణ్యత కొరకు 186 శాంపిల్స్ పరీక్షిస్తే 2 నాణ్యతలేనివని గుర్తించారు.
ఇది కూడా చదవండి..
వాలంటీర్లకు శుభవార్త: 14 నుంచి 'వలంటీర్లకు వందనం'
విత్తనాలు మరియు ఎరువుల నాణ్యత నిర్ధారణ పరీక్షల కొరకు ఇదివరకున తాడేపల్లెగూడెం, హైదరాబాద్‌లోని ల్యాబ్స్ కు పంపవలసి వచ్చేది. పైగా రిపోర్ట్స్ రావటానికి కూడా ఎక్కువ సమయం పట్టేది. కానీ ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లలో పరీక్ష చేసిన మూడు రోజుల లోపే రిపోర్టులను అందిస్తున్నారు. దీనితో రైతులకు సమయం కూడా ఆదా అవుతుంది. రైతులను దగా చేస్తున్న నకి'లీలల'కు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం పకడ్బందీ కార్యాచరణ అమలు చేస్తోంది. అందులో భాగంగా డాక్టర్ వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసింది. విత్తనాలు.. ఎరువుల.. పురుగుమందులను పక్కాగా పరీక్ష చేయిస్తోంది.
ఈ వై.ఎస్.ఆర్ అగ్రిటెస్టింగ్ లాబ్స్ లో మార్కెట్ లోకి వచ్చే ప్రతి ఇన్పుట్ ను ఇక్కడ పరీక్షించుకునే వీలు కల్పించడం వల్ల సాగుపై రైతులకు మరింత నమ్మకం కలుగుతుంది. రైతులు గతంలో నకిలీ విత్తనాలు, ఎరువులు వాడి ఆర్ధికంగా చాలా నష్టపోయారు. ఇప్పుడు ఈ ల్యాబ్ లో ఉచితంగా పరీక్షించుకుని నాణ్యమైన విత్తనాలను మార్కెట్లో కొనుగోలు చేస్కోవచ్చు. ఇక్కడా విత్తనాలే కాకుండా ఎరువులు మరియు క్రిమి సంహారక మందులను కూడా పరీక్షించుకోవచ్చు.
ఇది కూడా చదవండి..
Share your comments