తెలంగాణ పరిశ్రమ మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ మరియు థాయిలాండ్ ప్రభుత్వం వ్యవసాయ వాణిజ్యానికి సంబంధించి అవగాహన ఒప్పందం(memorandum of understanding) కుదుర్చుకున్నాయి
భారత్ - థాయ్‌లాండ్ దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవ నేపథ్యంలో ఈ అవగాహన ఒప్పందం(memorandum of understanding) కుదిరింది.ఈ ఒప్పందం వల్ల పరస్పర సహకారం తో పెట్టుబడులను ప్రోత్సహించే లక్ష్యంపై దృష్టి సారిస్తుంది. ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత ఆహార ప్రాసెసింగ్, కలప ప్రాసెసింగ్ మరియు కలప ఆధారిత పరిశ్రమలలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి.
ఒక దేశ వాణిజ్యశాఖ భారత్‌లోని రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం(memorandum of understanding) చేసుకోవడం చరిత్రలో ఇదే ప్రథమమని అధికారులు తెలిపారు. ఈ ఒప్పొంద కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్, థాయ్‌లాండ్ ఉప ప్రధాని, వాణిజ్యశాఖ మంత్రి జూరిన్ లక్సనావిస్ట్ వర్చువల్ పద్ధతిలో సమావేశమయ్యారు.రాష్ట్ర పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, థాయ్‌లాండ్ వాణిజ్యశాఖ కార్యదర్శి బూన్యరిత్ కలయానమిత్ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ విషయాలను తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్, పరిశ్రమలు & వాణిజ్యం మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి తారక రామ రావు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు.
అసలు Memorandum of understanding అంటే ఏమిటి?
అవగాహన ఒప్పందం (Memorandum of understanding) అనేది ఇరు పక్షల మధ్య మధ్య వ్రాతపూర్వక ఒప్పందం. ఈ రకమైన అవగాహన ఒప్పందం ద్వైపాక్షిక (ఇరు పక్షాల మధ్య) లేదా బహుపాక్షికంగా (రెండు కంటే ఎక్కువ) కూడా ఉంటుంది.
MOU చట్టబద్ధంగా కట్టుబడి ఉండనప్పటికీ అన్ని వర్గాలు తమ పరస్పర లక్ష్యాలతో ముందుకు సాగడానికి అంగీకరిస్తున్నట్లు ఏర్పరుచుకున్నదే ఈ అవగాహనా ఒప్పొందం. MOU తరచుగా అంతర్జాతీయ సంబంధాలలో కనిపిస్తుంది.
మరిన్ని చదవండి.
Share your comments