ఒకప్పుడు వ్యవసాయం చేయాలంటే ఎంతో భారంగా భావించే రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయాన్ని ఒక పండుగలాగా నిర్వహిస్తోంది.రైతులు పంట పెట్టుకోవాలని భావించినప్పటి నుంచి పంటను కొనుగోలు చేసే వరకు ప్రతి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుండి రైతులకు చేయూత అందిస్తోంది. పల్లె ప్రగతికి పట్టం కడుతూ... రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలో పథకాలను అమలు చేస్తుండటంతో రైతులు నూతన ఉత్సాహంతో వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కి జగన్ సర్కార్ వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది. ఈ రెండు సంవత్సరాల కాలంలో రైతులకు ఎన్నో పథకాలను చేరువ చేసే వారిని ఆర్థికంగా ముందుకు తీసుకువస్తోంది. ఈ క్రమంలోనే పలు జిల్లాలలో అగ్రి ల్యాబ్, ప్రతి గ్రామంలోనూ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు కావాల్సిన ప్రతి అవసరాన్ని రైతులకు సమకూరుస్తున్నారు. దీంతో రాష్ట్రంలో వ్యవసాయం ఆక్వా రంగాలలో ముందుకు దూసుకు వెళుతోంది.
కేవలం వ్యవసాయం చేసే వారికి మాత్రమే కాకుండా పాడి పరిశ్రమ రైతులకు అమూల్ పాల సేకరణ కేంద్రాలను ఇటీవల జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గ్రామాలలో రైతు భరోసా కేంద్రాల వద్ద పాల సేకరణ జరుగుతుంది. అదేవిధంగా రైతులకు రైతు భరోసా, పంటల బీమా, సున్నా వడ్డీ పథకం అందిస్తూ రైతులను ఆర్థికంగా ఆదుకున్నారు.ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు కావాల్సిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, మందులు, రాయితీతో రైతులకు అందిస్తోంది. అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా రైతు భరోసా కేంద్రాలతో అనుసంధానం చేసింది.
ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల దళారుల బెడద లేకుండా రైతులు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ అమ్ముకునే ఏర్పాట్లను చేసింది. అదే విధంగా ఆక్వా రైతులను కూడా ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఆక్వా చెరువులకు తక్కువ ధరకు విద్యుత్ సరఫరా, ఈ మార్కెట్ సదు పాయం, ఆక్వా ల్యాబ్‌ల ఏర్పాటు, నాణ్యమైన సీడు, ఫీడు, మందులు అందించేలా చర్యలు తీసుకొని రైతులను ఆర్థిక పథంలో నడిపిస్తున్నారు. ఎన్ని పథకాలు రైతుల ముంగిట్లోకి రావడంతో రైతులు వ్యవసాయం ఒక పండుగలాగా చేసుకుంటున్నారు.
Share your comments