రైతు భరోసా ( పాత రైతుబంధు పథకం ) స్థానం లో రైతులకు పెట్టుబడి సాయం అందిచండానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రైతు భరోసా డబ్బులను కేవలం వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే అందించనున్నట్లు తెలంగాణ వ్యవసాయ మంత్రి కీలక ప్రకటన చేసారు.
గురువారం ఢిల్లీలోని భారత మండపంలోని ర్వహించిన ప్రపంచ ఆహార సదస్సులో రాష్ట్రం తరఫున మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సదస్సు లో భాగంగా లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ, మోనిన్ ఇండియా ఎండీ జెర్మైన్ అరౌడ్, బీఎల్ ఆగ్రో ఎండీ నవనీత్ రవికర్ తో పాటు పలు ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీల ప్రతిని ధులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
అనంతరం ఢిల్లీ లోని తెలంగాణ భవన్ లో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం కేవలం 20 లక్షల మంది రైతులకే రుణమాఫీ చేసిందని.. కానీ కాంగ్రెస్ సర్కార్ 42 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తున్నదని చెప్పారు. రూ.2 లక్షల లోపు పంట రుణం ఉన్న 22 లక్షల మంది రైతులకు రూ.18 వేల కోట్ల ఒకేసారి రుణమాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానికే
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి వినతిపత్రం అందజేస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వర రావు దక్కుతుందన్నారు. పంట నష్టంతో రైతులు ఇబ్బందు లు పడకుండా ప్రీమియం ప్రభుత్వమే కట్టి ఇన్సూరెన్స్ చెల్లిస్తుందని చెప్పారు. ప్రతి పంట, ప్రతి రైతుకు బీమా వర్తించేలా రూ.3,000 కోట్లతో ఇన్సూరెన్స్ చేయనున్న ట్లు ఆయన ప్రకటించారు.
Share your comments