ఒక ప్రపంచ నివేదిక ప్రకారం కాలుష్యం కారణంగా 2019లో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 90 లక్షల మంది మరణించారు.
వాహనాలు మరియు పరిశ్రమల నుండి వెలువడే విషపు పొగ వల్ల గాలి విపరీతంగా కాలుష్యం చెంది ఈ మరణాలకు కారణం అయింది. 2000 సంవత్సరం తో పరిగణినిస్తే వాయు కాలుష్యం 55 శాతం పెరిగింది.లాన్సెట్ కమిషన్ ప్రస్తుత వాయు కాలుష్యం పై సంచలన వ్యాఖ్యలు చేసింది, ప్రపంచ ఆరోగ్యంపై కాలుష్య ప్రభావం "యుద్ధం, ఉగ్రవాదం, మలేరియా, HIV, క్షయ, డ్రగ్స్ మరియు ఆల్కహాల్ కంటే చాలా ఎక్కువ" అని పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది అకాల మరణాలలో ఒకటి కాలుష్యం కారంగా సంభవిస్తుంది, 2015 నుండి ఈ సంఖ్య మారలేదు. గాలి, నీరు మరియు నేల, వీటిలో ఏది కాలుష్యానికి గురైన అది మాన ఆరోగ్యం పై విపరీతమైన ప్రభావాన్ని చూపుతుంది ఫలితంగా గుండె జబ్బులు, క్యాన్సర్, శ్వాసకోశ సమస్యలు, అతిసారం మరియు ఇతర తీవ్రమైన అనారోగ్యాలకు కారణమవుతాయి.
గాలిలో సీసం పెరగడం కూడా విపరీతమైన అనర్థాలకు దారి తీస్తుంది.గాలిలో సీసం శాతం పెరగడం వలన ముందస్తుగానే గుండె జబ్బులకి గురై మరణాలు సంభవిస్తున్నాయి.కొన్ని దేశాలు పెట్రోల్ లో ఈ సీసంని నిషేధించాయి.
కాలుష్య మరణాలలో భారతదేశం మరియు చైనా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి, సంవత్సరానికి దాదాపు 2.4 మిలియన్ల మరణాలు సంభవిస్తున్నాయి, అయితే ఈ రెండు దేశాలు కూడా ప్రపంచంలోనే అత్యధిక జనాభాను కలిగి ఉన్న విషయం తెలిసినదే.
ప్రస్తుతం భారతదేశంలో అత్యంత కలుషితమైన 10 నగరాలు:
1)భివాడి (రాజస్థాన్)
2)ఘజియాబాద్ (ఉత్తర ప్రదేశ్)
3)ఢిల్లీ
4)జాన్‌పూర్
5)నోయిడా
6)బాగ్పత్
7)హిసార్
8)ఫరీదాబాద్
9)గ్రేటర్ నోయిడా
10)కోల్‌కతా
మరిన్ని చదవండి
Share your comments