తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరి పైర్లు రుబ్బు చేసే దశ నుండి చిరుపొట్ట దశలో ఉన్నాయి. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న వరి పైర్లలో మొగిపురుగు, దేవుడు, నాను, సర్ఫేస్ ధాతు విషప్రభావం, జింక్ లోపం మరియు ఇతర రకాల చీడపీడలు. ఆశించడం వలన పంట నష్టం జరుగుతుందని క్షేత్ర సందర్శనల ద్వారా గమనించడమైనది. ముఖ్యంగా ఈ సమస్యలు సిద్ధిపేట, మెదక్, కరీంనగర్, కామారెడ్డి జిల్లాల్లో ఎక్కువగా గమనించడమైనది. కావున ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు మరియు చేపట్టవలసిన యాజమాన్య చర్యలను సూచించడమైనది.
సమస్యః పిలకదశ నుండి దుబ్బు చేసే దశలో ఉన్న వరిపైర్లలో నాచు ఉండటం వలన ఎదుగుదల పూర్తిగా ఆగిపోవడం, నివారణ: వరి పొలంలో నాచు కట్టడం వలన ఎదుగుదల లేకపోవడంతో రైతులు పైపాటుగా యూరియా మరియు సిఫారసు చేయబడని సేంద్రియ గుళికలను వేయడం గమనించడమైనది. కావున ఈ సమస్య నుండి అధిగమించడానికి వరి పొలాన్ని చేతులతో కలియబెట్టాలి. అలాగే పొలాన్ని అడపాదడపా అడగట్టాలి.
• సమస్య పొలంలో చవుడు మరియు జింక్ లోపం వంటి సమస్యలను నివారించడానికి సిఫారసు చేయబడని సేంద్రియ // సీ-వీస్ ఎక్స్ట్రాక్ట్ను వేయడం మరియు పొలాన్ని పూర్తిగా నెర్రలు ఏర్పడే వరకు ఎండగట్టడం.
నివారణ: పొలంలో నీరు పెట్టి తర్వాత బయటకు తీసివేయాలి. వరి పైరు ఎదుగుదలకు మరియు భూమిలో ఉన్న శిలీంధ్రాలను నివారించడానికి కలుపు తీసిన తర్వాత ఒక ఎకరానికి 25-30 కిలోల యూరియా మరియు కార్బండాజిమ్ 25% + మ్యాంకోజెట్ 50% పొడి మందును కలిపి బురద పదునులో చల్లాలి. జింక్ లోపం గమనించినట్లైతే జింక్ సల్ఫేట్ (21-33%)22గ్రా.
లీటరు నీటికి కలిపి ఐదు రోజుల వ్యవధితో రెండు సార్లు పిచికారి చేయాలి.
సమస్య: ఈ యాసంగిలో కొన్ని ప్రాంతాల్లో మొగిపురుగు ఉధృతి అధికంగా ఉన్నది. దీనిని నివారించడానికి రైతులు క్లోరిపైరిఫాస్ 10జి గుళికలు/సేంద్రియ గుళికలు యూరియాలో కలిపి వేయడంతోపాటుగా సైవరెమెత్రిన్ లేదా క్లోరిపైరిఫాస్ పురుగు మందులను పిచికారి చేయడం వల్ల పురుగు నివారణ జరుగలేదు.
వరి పంటను ఆశించే వివిధ రకాల పురుగులు వాటి నివారణ ...
నివారణ: వరిలో కాండం తొలిచే పురుగు రెండుదశల్లో ఆశిస్తుంది. ప్రస్తుతం ఈ పురుగు ఉధృతి పిలక దశలో (మొవ్వ చనిపోవడం) ఆశించి అధికంగా నష్ట పరుస్తున్నది. ఈ పురుగు నివారణకు సమగ్ర రక్షణ చర్యలను చేపట్టాలి.
• వరి పంట వాటిన 15-40 రోజుల దశలో ఉన్న పైర్లలో కార్బోప్యూరాన్ 3జి 10 కిలోలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4 కిలోలు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.4జి ప్ర4 కిలోలు ఎకరానికి చొప్పున 25 కిలోల పొడి ఇసుకతో కలిపి బురద పదునులో వేయాలి.
• వరి పంట అంకురం ఏర్పడే దశ నుండి చిరుపొట్ట దశలో రెక్కల పురుగులు గమనించినట్లైతే ఒక ఎకరానికి 60 మి.లీ. క్లోరాంట్రానిలిప్రోల్ లేదా 400 గ్రా. కార్టాప్ హైడ్రోక్లోరైడ్ లేదా 100 మి.లీ. టెట్రానిలిప్రోల్ పిచికారి చేయాలి,
ప్రస్తుతం రైతులు వరి పంటలో ఎదుర్కొంటున్న సమస్యలను గురించి వివరించడమైనది. రానున్న రోజుల్లో అనగా ఫిబ్రవరి-మార్చి మాసాలలో వరి పంటలో అగ్గి తెగులు (మెడవిరుపు) కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ ముందుగా నాట్లు వేసిన కొన్ని జిల్లాల్లో ఈ సమస్యను గుర్తించడం జరిగింది. వరి పైరు వివిధ సమస్యల వలన ఎదగటం లేదని యూరియాను - పైపాటుగా మోతాదుకు మించి వేసిన ప్రాంతాల్లో ఈ తెగులు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించడమైనది. అగ్గితెగులు లక్షణాలు గమనించినట్లైతే యూరియాను వేయడం తాత్కాలికంగా నిలిపివేయాలి. లక్షణాలను తొలిదశలో గుర్తించి సిఫారసు చేయబడిన తెగుళ్ళ మందులను పిచికారి చేయాలి.
డా॥ సి. రఘురామి రెడ్డి ప్రధాన శాస్త్రవేత్త (వరి) & హెడ్
వరి పరిశోధన సంస్థ రాజేంద్రనగర్, హైదరాబాద్ - 30
Share your comments