హైదరాబాద్‌లో ఈరోజు కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు. సాధారణంగా ముఖ్య రాజకీయ నేతల పర్యటన ఉన్న లేదా ఎటువంటి వేడులకు జరుగుతున్నా, ఆ ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తారు. ఎందుకంటే ఈ వేడుకల్లో వందలాది మంది పాల్గొంటారు, ఇందువలన ప్రయాణికులకు ఆటంకాలు కలగకుండా ట్రాఫిక్ పోలీసులు ఈ ట్రాఫిక్ ఆంక్షలను పెడతారు.
తెలంగాణ ప్రభుత్వం బుధవారం అనగా నేడు రంజాన్ మాసం సందర్భంగా ఎల్బీ స్టేడియంలో ముస్లిం సహోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ఎల్బీ స్టేడియంలో జరగనున్న ఈ ఇఫ్తార్ విందుకు సీఎం కేసీఆర్ తో పాటు పలు మంత్రులు కూడా పాల్గొంటున్నారు. రోవైపు సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఎల్బీ స్టేడియం చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు చేస్తున్నామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
ఇఫ్తార్ విందు కారణంగా హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం 5 గంటల నుండి 9 గంటల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలియజేసారు. ఇఫ్తార్ విందుకు ఎల్బీ స్టేడియంకి పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు రానున్నారు. ట్రాఫిక్ పోలీసులు చూపించిన ప్రత్యామ్నాయ మార్గాలను ప్రజలు ఎంచుకొని పోలీసులకు సహకరించాలి అని తెలిపారు.
ఇది కూడా చదవండి..
అత్యంత ఖరీదైన మామిడి పండు ఏదో తెలుసా?
ట్రాఫిక్ ఆంక్షల కారణంగా దారి మళ్లించే మార్గాలు:
చాపెల్ రోడ్, నాంపల్లి నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలను ఏఆర్ పెట్రోల్ పంప్ వద్ద పీసీఆర్ వైపు మళ్లించనున్నారు.
ఎస్బీఐ గన్ ఫౌండ్రీ నుంచి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్, బషీర్ బాగ్ ఫ్లై ఓవర్ వైపు వచ్చే వాహనాలను ఎస్బీఐ గన్ ఫౌండ్రీ వద్ద చాపెల్ రోడ్డు వైపు మళ్లించనున్నట్లు పోలీసులు తెలిపారు.
బషీర్ బాగ్ నుంచి పీసీఆర్ వైపు వచ్చే వాహనాలను బషీర్ బాగ్ వద్ద లిబర్టీ వైపు మళ్లించనున్నారు.
బషీర్ బాగ్ ఫ్లై ఓవర్ పైకి వచ్చే వాహనాలను బీజేఆర్ విగ్రహం వద్ద కుడి మలుపు తీసుకోవడానికి అనుమతి లేదు. ఎస్బీఐ గన్ ఫౌండ్రీ వరకూ వెళ్లి చాపెల్ రోడ్డు వైపు కుడి మలుపు తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు.
రవీంద్ర భారతి, హిల్ ఫోర్ట్ రోడ్డు నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వెళ్లే వాహనాలను ఫతే మైదాన్ లోని కేఎల్కే బిల్డింగ్ వద్ద సుజాత హైస్కూల్ వైపు దారి మళ్లించనున్నారు.
ఇది కూడా చదవండి..
Share your comments