News

ఆంధ్ర ప్రదేశ్ కు మరోసారి రెన్ అలెర్ట్; విజయవాడలో బురదను తొలగించేందుకు రంగంలోకి ఫెరింజన్లు

KJ Staff
KJ Staff
Representative Image , Source: UGC
Representative Image , Source: UGC

ఇప్పటికే భారీ వర్షాలు, వరదలో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్నా ఆంధ్ర ప్రదేశ్ ప్రజల కు వాతావరణ శాఖ మరో షాకింగ్ న్యూస్ ప్రకటించింది రానున్న  రెండు రోజులలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఉత్తరాంధ్ర, దక్షిణఒడిశా తీరాల వైపు కదులుతూ ఆదివారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది, దీని కారణంగా శుక్ర, శని వారాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

ముఖ్యంగా, విశాఖపట్నం,అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా ఏలూరు, పల్నాడు ఎన్‌టి‌ఆర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.

మరోవైపు భారి వర్షాల కారణంగా వరదలో చిక్కుకున్న విజయవాడలో రెస్క్యూ, మరియు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

విజయవాడలో క్రమంగా వరదనీరు తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో కాలనీల్లోకి కొట్టుకొచ్చిన బురదను తొలగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సింగ్ నగర్ సమీపంలో వరద మిగిల్చిన బురదను తొలగించేందుకు BRTS రోడ్డుకు పెద్ద ఎత్తున ఫైరింజన్లు చేరుకున్నాయి. మరోవైపు 4వేల పారిశుద్ధ్య కార్మికులను విజయవాడకు తీసుకొస్తామని అధికారులు తెలిపారు.

Share your comments

Subscribe Magazine

More on News

More