ఆధార్ వినియోగదారులకు ముఖ్య గమనిక. యూఐడీఏఐ ఆధార్ కార్డ్‌లో ఏవైనా మార్పులు, చేర్పులు లేదా ఆధార్ అప్డేట్ కోసం కఠినమైన నిబంధనలను ప్రవేశపెట్టింది. ఇప్పటి నుండి, ఆధార్ కార్డులో పేర్కొన్న చిరునామాను మార్చడానికి గుర్తింపు పొందిన గెజిటెడ్ అధికారుల నుండి అవసరమైన ధృవీకరించబడిన పత్రాలను సమర్పించిన తర్వాత మాత్రమే సాధ్యమవుతుంది.
వినియోదారులు ఆధార్ లో మార్పులు చేయడానికి, వ్యక్తులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్‌లను సమర్పించాల్సి ఉంటుందని యూఐడీఏఐ తెలిపింది. సమర్పించిన సర్టిఫికెట్లు లేదా డాక్యుమెంట్లలో స్పెల్లింగ్ తప్పులు లేదా ఇతర అవకతవకలు కనిపిస్తే, ఆధార్ కార్డు కలిగి ఉన్న వ్యక్తికి రూ.1000 జరిమానా విధించబడుతుందని, దానిని ఆధార్ సేవా కేంద్రానికి చెల్లించాలి అని తెలిపింది.
ఆధార్ కార్డులు పొందేందుకు సమర్పించిన దరఖాస్తులు లేదా రుజువులలో ఏవైనా తప్పులు కనిపిస్తే ఆధార్ సేవా కేంద్రం రూ.10,000 జరిమానా యూఐడీఏఐకి చెల్లించాలి. అదనంగా, ఆధార్ కార్డుల కోసం దరఖాస్తుదారులు ధృవీకరించని పత్రాలను సమర్పించిన కారణంగా అనేక ఆధార్ సేవా కేంద్రాల లైసెన్స్‌లను యూఐడీఏఐ రద్దు చేసింది.
ఇది కూడా చదవండి..
పెను తుఫానుగా మారిన సైక్లోన్ 'మోచా'.. ఈ రాష్ట్రాల్లో హై అలెర్ట్
దీంతో అక్షయ కేంద్రాల వంటి సేవా కేంద్రాలను నెలకొల్పిన వికలాంగుల కుటుంబాలు తమ లైసెన్సులను కోల్పోవడమే కాకుండా లక్షల రూపాయల భారీ జరిమానాను కూడా ఎదుర్కొంటున్నారు. వృద్ధులు తమ పేర్లు మరియు చిరునామాలు వంటి వారి వ్యక్తిగత సమాచారానికి సవరణలు కోరినప్పుడు ఆధార్ సేవా కేంద్రాలలో అసంపూర్ణమైన మరియు ధృవీకరించని పత్రాలను అందించినట్లు నివేదించబడింది. ఆధార్ కార్డును అప్‌డేట్ చేయడానికి అందించిన ప్రతి వ్యక్తిగత సేవకు యూఐడీఏఐ ప్రతి ఆధార్ కేంద్రానికి రూ.36 చెల్లిందడం గమనించాలి.
ఇది కూడా చదవండి..
Share your comments