తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు అలెర్ట్. హైదరాబాద్‌లోని వాతావరణ శాఖలోని నిపుణుల అభిప్రాయం ప్రకారం, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వచ్చే 72 గంటల వ్యవధిలో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు కురుస్తాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తారు, అలాగే ఉత్తర తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
హైదరాబాద్, ఉత్తర తెలంగాణ జిల్లాలు, మహబూబ్‌నగర్, వికారాబాద్, సూర్యాపేట, నల్గొండ, నారాయణపేట, రంగారెడ్డి జిల్లాలు, మేడ్చల్, మల్కాజిగిరి, వరంగల్, కొత్తగూడెం సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లులు కూడా పడే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.
నిన్న హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, షేక్‌పేట, మణికొండ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్‌లోని కాప్రా, బోడుప్పల్ ప్రాంతాల్లో రాత్రి 7 గంటల సమయంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్ ప్రాంతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మధ్య అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి..
విద్యార్థులకు బిగ్ అలర్ట్…నేడు రాష్ట్రంలో పాఠశాలలు, కాలేజీలు బంద్
దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాలలో తేలికపాటి నుండి భారీ వర్షపాతం సంభవించే అవకాశం ఉంది. ప్రత్యేకించి, అండమాన్ మరియు నికోబార్ దీవులతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాలు గణనీయమైన అవపాతం పొందవచ్చని అంచనా వేయబడింది. ఈశాన్య రుతుపవనాల కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
ఇది కూడా చదవండి..
Share your comments