వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ చేసే దిశగా ప్రభుత్వం త్వరలో దేశవ్యాప్తంగా రైతులకు ఆధార్ తరహాలో ప్రత్యేక గుర్తింపు కార్డును అందించేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించనునట్లు వ్యవసాయ కార్యదర్శి
తెలిపారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలను త్వరలో విడుదల చేస్తామని, రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభమవుతుందని ప్రకటించారు.
కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) మరియు కిసాన్ క్రెడిట్ కార్డ్ ప్రోగ్రామ్‌తో సహా వివిధ వ్యవసాయ పథకాలను రైతులకు ఎక్కువ ఇబ్బంది లేకుండా యాక్సెస్ చేయడంలో యూనిక్ ఐడి సహాయపడుతుందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
అదేవిదంగా ఈ కార్డు వుంటే రైతులు ఏదయినా పథకానికి దరఖాస్తు చేసినప్పుడు పదే పద్ సెరిఫికేట్ వెరిఫికేషన్ అవసరం లేదని , కేవలం ఈ ఒక్క కార్డు సమర్పిస్తే సరిపోతుందని అన్నారు.
Share your comments