మిర్చి పంటను వేయాలంటేనే భయపడేవిదంగా తెగుళ్ళ సమస్యలు రైతులను వెంటాడుతున్నాయి ఇదే క్రమంలో తెలంగాణ లో గత ఏడాది ఖమ్మంలో 35 వేలు పలికి రికార్డు సృష్టించగా ఈ ఏడాది ఏకంగా వరంగల్ ఏనుమాముల మార్కెట్కు కేవలం నాలుగు క్వింటాళ్ల దేశీ రకం మిరపకాయలు(పొడి)-దేశి వరంగల్ రకం 4 క్వింటాలు రాగ క్వింటాల్ కు గరిష్టముగా 80,100 చొప్పున రికార్డు ధర పలికిందీ ఇప్పుడు ఆ రికార్డును చెరిపేస్తూ గరిష్టంగా రూ . 81000 ధర పలికింది .
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో మిర్చి ఆల్ టైం రికార్డు ధర పలికింది. కొత్త రకం మిర్చి ధర రికార్డు క్రియేట్ చేసింది. చివరి సరి మిర్చి దేశీయ రకం 80100 ఇప్పుడు ఏకంగా రూ . 81 000 మార్కును దాటింది .
బంగారం ధరను మించిపోయింది. జిల్లాలోని ఏనుమాముల మార్కెట్ లో కొత్త మిర్చి ధర రూ.81,000లు పలికింది. ఏనుమాముల మార్కెట్ చరిత్రలోనే దేశీయ మిర్చికి అత్యధిక ధర ఇదే. క్వింటాల్ మిర్చి ఏకంగా రూ.81,000 పలికి ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది.
ప్రస్తుతం తులం బంగారం ధర రూ.53 వేలు ఉండటంతో మిర్చి ధర బంగారం ధర కంటే ఎక్కువగా పెరిగిపోవడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈసారి వర్షాలకు తోడు నల్లనల్లి, తామరపురుగు ఎఫె క్ట్తో మిర్చి పంట దెబ్బ తిని దిగుబడి తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరిగింది. ఖమ్మం, వరంగలు తో పాటు ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు మార్కెట్ నుంచి విదేశాలకు మిర్చి ఎగుమతి అవు తోంది. వారం పది రోజుల నుంచి మార్కెట్లకు మిర్చి రాక మొదలైంది.
పొలం దున్నుతుండగా బయటపడ్డ పురాతన సంపద ..
మరో వైపు సంవత్సరం కూడా మిర్చి రైతులను తెగుళ్లు నష్టాన్ని కల్గిస్తున్నాయి ఎప్పటికి రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో తెగుళ్ల దాడికి పంటలు గణనీయంగా నష్టపోయాయి . దీనితో మిర్చి సాగు చేయడానికి రైతులు భయపడుతున్నారు దీనితో ధరలు గరిష్టంగా పెరుగుతున్నాయి .
Share your comments