News

రుణమాఫీకి 6,385 కోట్లు కేటాయింపు .. 90 వేలలోపు రుణాలన్నీ మాఫీ

Srikanth B
Srikanth B

ఎన్నికలు సమీపిస్తున్న వేళా రైతుల రుణమాఫీ పై అసెంబ్లీ లో వాడి వేడిగా చర్చలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రతి పక్షాలు రుణమాఫీ పై పదే పదే ప్రశ్నలు అడుగుతున్నాయి , దీనికి అసెంబ్లీ సాక్షిగా సమాధానం ఇచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి రుణమాఫీకి 6,385 కోట్లు కేటాయించినట్లు , 90 వేలలోపు రుణాలన్నీ మాఫీ అమలు త్వరలోనే అమలు జరుగుతుందని 2023-24 బడ్జెట్‌లో రుణమాఫీకి రూ.6,385 కోట్లు కేటాయించామని వెల్లడించారు.

రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ అమలు చేస్తున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. 2023-24 బడ్జెట్‌లో రుణమాఫీకి రూ.6,385 కోట్లు కేటాయించామని వెల్లడించారు.

ప్రస్తుతం రూ.90 వేల లోపు ఉన్న రుణాలన్నీ మాఫీ చేస్తామని వివరించారు. ఆదివారం శాసనసభలో ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్‌రెడ్డి, గణేశ్‌ బిగాల, నలమోతు భాసర్‌రావు, ఆశన్న గారి జీవన్‌ రెడ్డి, అంజయ్య యాదవ్‌, దుర్గం చిన్నయ్య, పొడెం వీరయ్య, భట్టి విక్రమార్క అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. 2014లో ఇచ్చిన హామీ మేరకు 35.81 లక్షల మంది రైతులకు రూ.16,144 కోట్ల రుణాలు మాఫీ చేశామని తెలిపారు. 2018లో రూ.21,556 కోట్లు అవసరమని అంచనా వేశామని గుర్తుచేశారు. ఇప్పటివరకు 5.42 లక్షల మంది రైతులకు రూ.36 వేల వరకు రుణాలను మాఫీ చేశామని చెప్పారు.

కనీస మద్దతు ధర కోసం మరో రైతు ఉద్యమానికి సన్నాహాలు..

అదేవిధముగా కొల్లాపూర్‌ నియోజకవర్గ పరిధి రాంపూర్‌లో రూ.5.45 కోట్లతో పండ్ల మార్కెట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు నిరంజన్‌రెడ్డి ప్రకటించారు.

కనీస మద్దతు ధర కోసం మరో రైతు ఉద్యమానికి సన్నాహాలు..

Share your comments

Subscribe Magazine

More on News

More